Money: మీ ఇంట్లో డబ్బులు అక్కడ పెడితే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?

  • Written By:
  • Updated On - March 7, 2024 / 06:25 PM IST

వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఆర్థికపరమైన మానసికపరమైన ఇబ్బందులను తొలగించుకోవచ్చు. క్రమం తప్పకుండా వాస్తు విషయాలను పాటిస్తేమంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే ఆ సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. మరి డబ్బు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి నియమాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భోజనాల గదికి ఉత్తరం లేదా ఈశాన్య గోడపై పెద్ద అద్దంను అమర్చాలి. దీనివల్ల సంపద, శ్రేయస్సు కలుగుతుంది.

ఇంటి నైరుతి మూలలో దక్షిణ దిక్కువైపు తలపెట్టి నిద్రించాలి. హింసను ఏ రూపంలోనైనా చిత్రీకరించే చిత్రాలు లేదా ఫోటోలు ఇంట్లో, వ్యాపార సంస్థల్లో ఉంచకూడదు. హింస ప్రతికూలతను ఆకర్షించడంతో పాటు మీ ఎదుగుదల నిరోధిస్తుంది. దక్షిణాన ఎరుపు కాంతిని అమర్చడం వల్ల కీర్తి, విజయం లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే నైరుతి దిశలో ఆ కుటుంబ సభ్యుల చిత్రాలు ఉంచాలి. పిల్లలు ఉత్తరం వైపు ఎదురుగా ఉంటే చదువులో విజయం సాధిస్తారు. వివాహం చేసుకోవాలనుకునే బ్రహ్మచారులు తమ ఇంటి వాయువ్య దిశలో ఉన్న గదుల్లో ఉండాలి లేదంటే డ్రాయింగ్ రూమ్‌లో నైరుతి దిశలో పన్నీర్ పువ్వులు ఉంచాలి.

ఉత్తరాన తయారు చేసిన డ్రాయర్లలో నగదు ఉంచడం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. డ్రాయర్ లోపల అద్దం అమర్చాలి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, తగాదాలవంటి సమస్యలను పరిష్కరించడానికి స్ఫటికాలతో కూడిన విండ్-చైమ్‌లను బెడ్‌రూమ్ కిటికీలపై ఉంచాలి. ఆరోగ్యం, శ్రేయస్సు కోసం, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వైఖరి ఉండటం కోసం శక్తులు స్వేచ్ఛగా ఇంటి మధ్యలో ఉండేలా చూసుకోవాలి.