Site icon HashtagU Telugu

Lakshmi Devi: లక్ష్మిదేవి అనుగ్రహం కావాలి అంటే చీమలకు ఈ ఆహరం పెట్టాల్సిందే!

Lakshmi Devi

Lakshmi Devi

మామూలుగా చాలామంది లక్ష్మిదేవి అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు, పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అలాగే ప్రత్యేకమైన పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. అయితే వీటన్నిటితో పాటుగా మనిషికి మంచి గుణం ఉండాలని, చుట్టూ ఉన్న ప్రాణులకు కూడా ఎలాంటి హాని చేయకూడదని చెబుతున్నారు. అందుకే ప్రకృతిని ఎవరైతే కాపాడుతారో వారికి ముక్కోటి దేవతల అనుగ్రహం తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా చీమలకు కొన్ని రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వల్ల లక్ష్మి అనుగ్రహం తప్పక కలుగుతుందని చెబుతున్నారు.

ఈ విషయం గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. చీమలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. వాటికి దొరికిన ఆహారాన్ని భూమి లోపల దాచి పెడుతూ ఉంటాయి. అలా చీమలు దాచే విత్తనాలు సైతం మొలకెత్తి వృక్ష జాతి కూడా పెరుగుతుంది. మన పురాణాల్లో చీమలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే వాటికి ఆహారం పెట్టడాన్ని అత్యంత పవిత్రమైన కార్యక్రమంగా సంప్రదాయాలు చెబుతున్నాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే చీమలకు ఏం చెయ్యాలి అన్న విషయానికి వస్తే.. చీమలకు ఇష్టమైన తేనెను ఆహారంగా పెడితే ఇంట్లో సంబంధాలు బలపడి సుఖ సంతోషాలు, సంపద కలుగుతాయట. అలాగే బెల్లంని చీమలకు పెడితే ఆర్థిక కష్టాలు తీరి అభివృద్ధి, సంక్షేమం లభిస్తుందట.

అదేవిధంగా చీమలకు పంచదార పెడితే ఇంట్లో ఆర్థిక స్థిరత్వం ఉంటుందట. చీమలకు గోధుమపిండిని ఆహారంగా పెడితే అప్పులు తీరతాయట. ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. చీమలకు బియ్యం పిండి ఆహారంగా పెడితే ఆర్థికంగా వృద్ధి లభిస్తుందట. లక్ష్మీ దేవి అమ్మవారికి ఇష్టమైన రోజు అయిన శుక్రవారం నాడు ఈ ఆహారాలను ఒక విస్తరాకులో కొద్ది కొద్దిగా వేసి చీమల పుట్ట దగ్గర పెట్టాలి. ఆలయంలో లేదా పెరట్లో, గార్డెన్‌ లో కూడా పెట్టవచ్చు. శుక్రవారం కుదరకపోతే బుధవారం, శనివారం కూడా ఈ ఆహారం చీమలకు పెట్టవచ్చట. ఈ రకంగా చేస్తే వారి ఇంట చెడు శక్తులు తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.