Vastu Tips: పటికతో ఈ రెమెడీ ట్రై చేస్తే చాలు.. డబ్బే డబ్బు?

పటిక బెల్లం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం ఆరోగ్యపరంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎన

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 09:23 PM IST

పటిక బెల్లం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం ఆరోగ్యపరంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. వాస్తు శాస్త్ర పరంగా ఇంట్లో పటికను ఉంచుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పటికను ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. కుటుంబంలో ఆనందం, శాంతి ఎల్లప్పుడు కలుగుతాయి. పటికను ఆరోగ్య సంపదగా పరిగణిస్తారు. కొద్దిపాటి పాతికతో చాలా రోగాలు నయమవుతాయి. అదేవిధంగా పటికను ఉపయోగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. వ్యాపార మెరుగుదల, విద్యార్థులకు సంబంధించిన విషయాలకు ఎర్రటి గుడ్డలో కొద్దిగా పటికను చుట్టి ఆ వస్త్రాన్ని వ్యాపారంలో ఏ మూలన ఉంచినా కూడా సమస్యలు దూరం అవుతాయి. కొందరి ఇళ్లలో తరచూ గొడవలు అవుతాయి. అప్పుడు టెన్షన్లు కూడా ఎక్కువవుతాయి. అప్పుడు ఒక గిన్నెలో పాటికను వేసి ఇంట్లో ఏదైనా మూలంలో పెట్టాలి. ఇంట్లోని గొడవలు తగ్గుతాయి. ఆ ఉద్రిక్త వాతావరణానికి తెరపడుతుంది అంతేకాదు, ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారు పడుకునే మంచం కింద కుండలో నీళ్లు నింపి , ఆ నీటిలో కొద్దిగా పటికను వేస్తే.. ఇంట్లో శాంతి నెలకొని, కుటుంబ కలహాలు తొలగిపోతాయి.

ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఒక గిన్నెలో 50 గ్రామాలు పటిక వేసి ఇంటి పూజగదిలో పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. మీ ఆదాయం దెబ్బతింటోంది. ఆదాయం తగ్గుతోంది, అప్పుల భారం పెరిగింది అనుకుంటే ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి, ఇంట్లో పటికను నీటిలో కలిపి క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం లేదా ఉద్యోగంలో పురోగతి లేకుండా ప్రయత్నాలన్నీ విఫలమవుతుంటే నష్టపోయే పరిస్థితి ఏర్పడితే.. అప్పుడు నల్ల గుడ్డలో పటికను కట్టి, ప్రధాన తలుపు వద్ద వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ప్రతికూలత ఉంటే ఏదైనా విషయం గురించి భయం ఉంటే, దాన్ని అడ్డుకుంటుంది, కిటికీలో ఒక గాజు గిన్నెలో పటిక ఉంచండి. అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండదు. ఆ ఇంట్లో భయం పోతుంది.