మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. ఈ కలల వల్ల కొన్ని సార్లు మంచి ఫలితాలు కలిగితే మరి కొన్నిసార్లు చెడ్డ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అయితే కలలు ఎప్పుడూ భవిష్యత్తుని సూచిస్తాయని చెబుతూ ఉంటారు. అయితే కలలో కొన్ని రకాల జంతువులు కనిపిస్తే చాలా మంచిది అని రాజయోగం పట్టబోతున్నట్టే అంటున్నారు పండితులు. మరి ఎలాంటి జంతువులు కనిపిస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాంటి తామర పువ్వు కనిపిస్తే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.
ఒకవేళ కలలో తామర పువ్వు కనిపిస్తే ఆకస్మిక ధనలాభం అని చెప్పవచ్చు. అలాగే రానున్న రోజుల్లో డబ్బులు కూడా వెతుక్కుంటూ మరీ వస్తాయట. అలాగే మనం ఏనుగుని విఘ్నేశ్వరుడిగా భావిస్తూ ఉంటాం. విఘ్నేశ్వరుడు ఎటువంటి ఆటంకాలను విజ్ఞాలు దూరం చేస్తాడు. కాబట్టి మీకు కలలో ఏనుగు కనిపిస్తే మీకు ఎదురయ్యే ఆటంకాలను విఘ్నేశ్వరుడు దూరం చేయబోతున్నాడని అర్థం. అలా కలలో ఏనుగు కనిపించినప్పుడు గణేష్ ని పూజించడం మంచిది. అలాగే ఆవుని గోమాతగా భావిస్తూ పూజలు కూడా చేస్తూ ఉంటాం. ఈ గోమాతలో సకల దేవతలు నివసిస్తారు. మరి అలాంటి గోమాత మనకు కలలో కనిపిస్తే వారి జీవితంలో సక్సెస్ వస్తుందని అర్థమట. అంతేకాకుండా జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి ఎదుగుతామన్నమాట.
గుడ్లుగూబను కొందరు చెడుకు గుర్తుగా కూడా భావిస్తారు. ఇది రాత్రిపూట మాత్రమే సంచరిస్తుంది. కానీ గుడ్లగూబ అరుపులు మంచి కావని చెప్తుంటారు. అదే విధంగా ఇది కలలో కన్పిస్తే మాత్రం అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ కలలో మీకు పాము కనిపిస్తే రాబోయే ఇబ్బందులకు సూచకగా భావించాలట. మన ముందు పాము కుడి వైపు నుంచి ఎడమ వైపుకు పోవడం లేదా మన వైపు చూసి పడగా విప్పుకునే కాసేపు చూసి వెళ్ళిపోతే అది ఆశీర్వదించినట్టు అర్థం. ఇలాంటి కలలు వస్తే కనుక ఉద్యోగంలో ప్రమోషన్లతో పాటు డబ్బుల ప్రయోజనాలు కూడా కలుగుతాయని పండితులు చెబుతున్నారు.