Lucky Saturday : శనివారం రోజు ఈ దృశ్యాలు చూస్తే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం?

శనీశ్వరుని అనుగ్రహంతో తప్పకుండా ధనవంతులు అవుతారని అదృష్టం (Lucky) పట్టి పీడించబోతుందని అర్థం.

Published By: HashtagU Telugu Desk
If You See These Scenes On Saturday, You Will Be Lucky..

If You See These Scenes On Saturday, You Will Be Lucky..

Lucky Scenes on Saturday : హిందూ ధర్మం ప్రకారం శనీశ్వరుడిని న్యాయ దేవుడిగా పిలుస్తారు. మనుషులు చేసే చర్యలను బట్టి వారికి మంచి చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాడు శనీశ్వరుడు. శనివారం రోజు శనీశ్వరుని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. శనివారం రోజున శనీశ్వరుని ఆలయాలకు వెళ్లి ఆయన భక్తిశ్రద్ధలతో పూజించి కొన్ని రకాల ధార ధర్మాలు చేయడం వల్ల శనీ అనుగ్రహం కలిగి ధనవంతులు అవ్వాల్సిందే. శనివారం రోజున నూనెలో మీ ముఖాన్ని చూసుకొని ఆ నూనెని శని దేవుని పాదాల వద్ద పెట్టడం వల్ల జాతకంలో శని దోషం ఉంటే తొలగిపోతుంది. అలాగే శనివారం రోజు కొన్ని శుభసూచకాలు కనిపిస్తే శనీశ్వరుడు మనల్ని అనుగ్రహించబోతున్నాడని అర్థం. అలాగే శనీశ్వరుని అనుగ్రహంతో తప్పకుండా ధనవంతులు అవుతారని అదృష్టం (Lucky) పట్టి పీడించబోతుందని అర్థం. మరి శనివారం రోజు ఎటువంటి దృశ్యాలు చూస్తే శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

నల్ల కుక్కను కాలభైరవుడి అంశంగా భావిస్తారు. కాబట్టి శనివారం రోజు నల్ల కుక్క ను చూడడం శుభసంకేతంగా భావించాలి. ఈ రోజున నల్ల కుక్కలకు ఆహారం ఇస్తే శని దేవుడు సంతోషిస్తాడు. ఆయ‌న‌ ఆశీర్వాదాలను మీకు అందజేస్తుంది. అంతే కాకుండా శనివారం నల్ల కుక్కకు ఆహారం తినిపిస్తే రాహు, కేతువుల అనుగ్రహం మీపై ఉంటుంది. అలాగే పేదవారికి, బిచ్చగాళ్లకు తోచిన విధంగా సహాయం చేయడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు. శనివారం నాడు భిక్షగాడిని చూస్తే రిక్తహస్తాలతో వెళ్లొద్దు. మీ సామర్థ్యాన్ని బట్టి ఏదైనా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడు సంతోషించి, మీ పట్ల దయ చూపిస్తాడు.

శనివారం రోజున నల్ల ఆవుని చూసినా, నల్ల కుక్కని చూసినా కూడా మీకు అదృష్టం కలగడం (Lucky) ఖాయం. శనివారం రోజు నల్ల ఆవు కనిపిస్తే అది శుభ సూచికంగా భావించాలి. అలా మీకు నల్ల ఆవు కనిపిస్తే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధించబోతున్నారని అర్థం. కాకిని శని దేవుని వాహనంగా భావిస్తారు. ప్రస్తుత ప్రకారం శనివారం రోజు కాకిని చూస్తే అది కూడా శుభసంకేతంగానే భావించాలి. అలాగే శనివారం రోజు కాకి నీళ్లు తాగడం చూస్తే మీకు శుభం కలుగుతుంది. దీని అర్థం ఆ వ్యక్తికి త్వరలో అదృష్ట యోగం (Lucky) ఉంద‌ని సంకేతం. నీరు తాగుతున్న కాకిని చూసిన‌ వ్యక్తి తాను భవిష్యత్తులో చేప‌ట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తాడు. శని దేవుడు కూడా అతనిపై దయతో ఉంటాడు.

Also Read:  Car Deals: కారు కొనాలనుకుంటున్నారా.. దిమ్మతిరిగే విధంగా ఇయర్ అండ్ ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్?

  Last Updated: 08 Dec 2023, 05:03 PM IST