Site icon HashtagU Telugu

Dream: కలలో ఇవి కనిపిస్తే చాలు.. ధనవంతులవ్వడం ఖాయం?

Dream

Dream

సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పీడకలు వేస్తే మరికొన్నిసార్లు మంచి మంచి కలలు వస్తూ ఉంటాయి. అయితే కలలో మనకు మూడు రకాల కలలు వస్తూ ఉంటాయి. జరిగిపోయినవి జరుగుతున్నవి, జరగబోయేవి. స్వప్న శాస్త్ర ప్రకారం కలలో ఎప్పుడూ కూడా భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. అయితే చాలావరకు మనకు కలలో వచ్చిన వస్తువులు కానీ మనకు వచ్చిన కలను కానీ మర్చిపోతూ ఉంటాం. కేవలం కొన్ని రకాల కలలు మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అయితే కొన్ని రకాల కలలు శుభ సంకేతాలను సూచిస్తాయి..

అయితే మరి కలలో ఎటువంటి కలలు వస్తే మనం ధనవంతులం అవుతామో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలలో తామర పువ్వు కనిపిస్తే భవిష్యత్తులో లక్ష్మీదేవి అనుగ్రహం , ఆశీర్వాదం తప్పకుండా పొందుతారని అర్థం. అలాగె చేతికి అందాల్సిన డబ్బు కూడా అందుతుంది. మీ కలలో తేనెపట్టు, తేనెటీగలు కనిపిస్తే అది చాలా శుభ సంకేతం. తియ్యటి తేనెను తెచ్చే తేనెటీగలు కనిపించడం అంటే మీ జీవితంలో ఆనందం రాబోతుందని అర్థం.

తామరపువ్వు, తేనెటీగలు అందరికీ కలల్లో కనిపించవు. ఇల్లంతా వీటి ఫొటోలే పెట్టుకున్నా కనిపిస్తాయనే గ్యారెంటీ లేదు. కానీ కనిపిస్తే మాత్రం అదృష్టవంతులు అవ్వడం కాయం. తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే శుక్రవారం రోజు తామర పువ్వులతో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అటువంటి తామర పువ్వులు కలలో కనిపించడం అంటే నిజంగా అదృష్టం అని చెప్పవచ్చు.