చాలామందికి కలలు వస్తుంటాయి. అది సర్వసాధారణం. కొందరికి కలలు గుర్తుంటాయి. మరికొందరికి గుర్తుండవు. కొంతమందికి వచ్చిన కలలు నిజం అవుతుంటాయి. అయితే స్వప్నశాస్త్రం ప్రకారం..కలలు మన భవిష్యత్తుకు సంబంధించి అనేక రకాల సమాచారాన్ని అందిస్తాయి. స్వప్న శాస్త్రంలో ప్రతి కలకు ఓ అర్థం ఉంది. తెల్లవారుజామున 3గంటల నుంచి 5 గంటల మధ్య వచ్చే కలలు నిజమయ్యే అవకాశం ఉందని చాలా మంది నమ్ముతారు. ఈ సమయంలో వచ్చే చాలా క లలు మీరు ధనవంతులు అవుతారని సూచిస్తాయి. కాబట్టి సంపదకు యజమానిగా మారడం గురించి ఎలాంటి కలలు వస్తాయో తెలుసుకుందాం.
కలలో ధాన్యం కుప్ప:
ఒక వ్యక్తి కలలో ధాన్యాల కుప్పపైకి ఎక్కినట్లు వచ్చిన్లయితే…మీరు చాలా డబ్బు సంపాదించబోతున్నారని దీని అర్థం.
చిన్న పిల్ల సరదా:
స్వప్న శాస్త్రం ప్రకారం…చిన్నపిల్లలు కలలో సరదా ఆడుతున్నట్లు కనిపిస్తే…మీరు ధనవంతులు కావడానికి ఇది సంకేతం. బ్రహ్మ ముహుర్త సమయంలో పిల్లల కలలు రావడం చాలా శుభసూచకం.
కలలో నీళ్లతో నిండిన కుండ:
మీకు కలలో నీటితో నిండిన కుండ కనిపిస్తే మీరు డబ్బు సంపాదిస్తారని అర్థం. బ్రహ్మ ముహుర్తంలో మట్టి కుండా లేదంటే పాత్రను చూసినట్లయితే…అది శుభప్రదంగా పరిగణిస్తారు. అలాంటి కలల ద్వారా ఒక వ్యక్తి అపారమైన సంపదను పొందుతారు.
కలలో నదిలో స్నానం:
మీరు బ్రహ్మ ముహూర్త సమయంలో నదిలో స్నానం చేస్తున్నట్లు కల వస్తే…అది పవిత్రమైంది, ఫలవంతమైంది. మీకు అలాంటి కలలు వస్తే అప్పుగా ఇచ్చిన డబ్బును మీరు త్వరలో తిరిగి పొందుతారని అర్థం.
కలలో విరిగిన పళ్ళు:
ఎవరైనా కలలో విరిగిన పంటిని చూస్తే, స్వప్న శాస్త్రం ప్రకారం, ఉపాధి వ్యాపారంలో లాభాన్ని సూచిస్తాయి.
కలలో ఇంటర్వ్యూ:
కలలో ఉద్యోగ ఇంటర్వ్యూని చూస్తే, మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని అర్ధం. అంతేకాక, కలలో పూర్వీకులు రావడం లాభానికి శుభ సంకేతం.