Lord Shani: శని దేవుడిని కర్మ దేవుడుగా పిలుస్తారు. మనం చేసిన పనుల ఆధారంగా కర్మ ఫలాలను అందిస్తాడట. అంటే మనం చేసే పనులను బట్టి శుభ అశుభ ఫలితాలను అందిస్తాడట. శని దేవుడికి కోపం వస్తే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయట. అతనికి కోపం వస్తే కొన్ని సంకేతాలు జీవితంలో కనిపిస్తాయని చెబుతున్నారు. శని దేవుడిని న్యాయ దేవుడుగా పిలుస్తారు. శని అనుగ్రహం ఉంటే ఏ సమస్యలు అయినా చిటికెలో తొలగిపోతాయట. కానీ శనికి కోపం వస్తే మాత్రం జీవితం అస్తవ్యస్తంగా మారుతుందని, ఇంట్లోని సంపద, ఆరోగ్యం రెండూ కోల్పోవాల్సి వస్తుందని, శనికి కోపం వస్తే ఆ విషయాన్ని జీవితంలో కొన్ని సంకేతాలు ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
ఇంతకీ ఆ సాంకేతాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. మనం ఏదైనా పని మొదలు పెట్టినా ఏదో ఒక విధంగా అడ్డంకులు ఎదురవ్వడం, ఓటమి ఎదురుకావడం వంటివి జరుగుతూ ఉంటాయి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరిగితే శని దేవుడికి మీపై కోపం వచ్చిందని అర్థం చేసుకోవాలట. శని దేవుడికి కోపం వస్తే మీరు చక్కగా ఆలోచించే శక్తిని కూడా కోల్పోయేలా చేస్తాడని చెబుతున్నారు. శని దేవుడు మీపై కోపంగా ఉన్నప్పుడు, మీరు అప్పుల బారిన పడతారట. ఇంట్లో అనవసర ఖర్చులు పెరుగుతాయట. ఇష్టం లేకపోయినా ఇతరుల నుండి తరచుగా డబ్బు అప్పుగా తీసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అలాగే ఒక వ్యక్తి మాదకద్రవ్యాల వంటి వ్యసనాలలో మునిగిపోయి చెడు అలవాట్లను పెంచుకుంటాడట.
ఇది శని దేవుడి ఆగ్రహానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో, మంచి పనుల కంటే చెడు పనుల వైపు వ్యక్తి మొగ్గు చూపుతాడట. శని దేవుడిని కర్మ దేవుడుగా పిలుస్తారు. ఇతరుల సంపదపై అధికారం చెలాయించే వారిపై ఆయనకు కోపం వస్తుందట. అలాంటి వ్యక్తులు అనేక తీవ్రమైన వ్యాధులతో బాధపడతారని చెబుతున్నారు. ఒక ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆటంకం ఎదురైతే, అది శని దేవుడి ఆగ్రహానికి సంకేతంగా భావించాలట. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని, శని కోపాన్ని తగ్గించే పరిహారాలు చేయడం మంచిదని చెబుతున్నారు.
Lord Shani: మీ జీవితంలో కూడా ఈ సంకేతాలు కనిపించాయా.. అయితే శనిదేవుడు మీపై కోపంగా ఉన్నట్లే!

Lord Shani