మరి కొద్ది రోజుల్లోనే దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్ద పెద్ద అమ్మ వార్లు, దేవుళ్ళ ఆలయాలలో నవరాత్రులకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇకపోతే ఈ నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులపాటు దుర్గామాతకు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈ తొమ్మిది రోజులపాటు అమ్మవారి భక్తి పారవశ్యంలో మునిగితేలుతూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ఉపవాసాలు చేయడంతో పాటు అమ్మవారికి ఇష్టమైన పువ్వులను నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు.
ఈ నవరాత్రుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలను పూజిస్తారు. అయితే మనం ఏ విషయం గురించి అయినా ఎక్కువగా ఆలోచించడం అలాగే ఒకే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండటం వల్ల కలలో అందుకు సంబంధించిన విషయాలు రావడం అన్నది సహజం. మరి ఒకవేళ ఈ నవరాత్రుల సమయంలో దుర్గామాత కలలో కనిపిస్తే అది దేనికి సంకేతమో అలా కనిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నవరాత్రుల్లో భక్తుల కలలో దుర్గమాత కోపంతో కూడిన రూపాన్ని పదేపదే చూస్తే దీన్ని అశుభ సంకేతంగా భావిస్తారు. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే ఈ కల ద్వారా మీకు తెలియకుండానే మీరు చేసిన తప్పు మీకు సరికాదని తల్లి చెప్పాలనుకుంటుందట.
మీరు తల్లి కోపాన్ని పోగొట్టాలంటే ముందుగా మీరు చేసిన తప్పులకు తల్లికి క్షమాపణలు అడగాలట. ఆ తర్వాత వెంటనే చెడు పనులను ఆపివేయాలని చెబుతున్నారు. అదేవిధంగా మీకు కలలో ఎర్రటి దుస్తులు చిరునవ్వులు చిందిస్తున్న అమ్మవారి రూపం కనిపిస్తే మీరు చాలా సంతోషపడాలట. అలాంటి కల వస్తే పవిత్రంగా భావించాలని, అలాంటి కథ వస్తే మీ జీవితంలో సంతోషాలు వెళ్లి విరుస్తాయని అర్థం అని అంటున్నారు. అలాగే వృత్తి నుంచి వ్యక్తిగత జీవితంలో మీరెన్నో ప్రయోజనాలను పొందుతారని ఈ కల సంకేతమట. ఒకవేళ జగదాంబ సింహం పై స్వారీ చేస్తున్నట్లు కల వస్తే అది ఎంతో పవిత్రమైనదిగా భావించాలట. అలాంటి కల వస్తే మీరు ఎంతో సంతోషంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే ఈ కల తల్లి పూర్తి అనుగ్రహం మీపై ఉందని అర్థం అంటున్నారు పండితులు.