Site icon HashtagU Telugu

Dreams: శివలింగం కలలో అలా కనిపిస్తే దాని అర్థం ఏంటో మీకు తెలుసా?

Dreams

Dreams

మాములుగా మనం నిద్రపోతున్నప్పుడు అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మనకు కళ్ళలో దేవుళ్ళు, దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. కొందరికి కలలో శివలింగం, లేదా పరమేశ్వరుడు కనిపిస్తూ ఉంటారు. మరి కలలో శివలింగం కనిపించడం మంచిదేనా అలా కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలలో శివ లింగాన్ని చూడటం సంతోషించదగ్గ విషయం అని చెబుతున్నారు. కలలో శివలింగాన్ని చూసారంటే మీరు ఎంతో సంతోషించాల్సిన విషయమట. ఈ కల మీరు చేపట్టిన పనిలో విజయం సాధించబోతున్నారు అనడానికి సంకేతంగా భావించాలి.

అంతేకాదు ఈ కల మీకున్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్ధం. ఈ కల చాలా చాలా శుభదాయకం. కాగా మీరు ఎప్పుడూ కలలో శివలింగాన్ని చూస్తున్నట్టైతే శివుడి అనుగ్రహం పొందబోతున్నారని అర్థమట. కలలో శివలింగం కనిపించడం శుభదాయకం అంటున్నారు పండితులు. అయితే ఇది మీ పూర్వజన్మకు సంబంధించినది కూడా కావచ్చని అంటున్నారు పండితులు. కలలో శివుడు కనిపించాడంటే మీరు చేసిన చెడు పనులకు శిక్షించబడ్డారని కూడా ఈ కల సూచిస్తుందని ఒక మత విశ్వాసం కూడా ఉంది. ఇప్పటితో మీ చెడ్డ రోజులు ముసిపోయాయి. అలాగే ఇప్పటి నుంచి మీకు అదృష్టం కలగబోతుందని నమ్ముతారు.

కలలో శివలింగం కనిపిస్తే ముందుగా మీరు మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శివాలయానికి వెళ్లండి. ఆ తర్వాత భోళాశంకరుడిని నిష్టగా పూజించండి. అలాగే శివుని పంచాక్షర స్తోత్రాన్ని పఠించండి. లేదా మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే మీ కలల శుభ ఫలితం రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు.