మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డ కలలు మరికొన్ని పీడకలలు. కొంతమంది మంచి కలలు వచ్చినప్పుడు సంతోషపడి, చెడ్డ కలలు, పీడకలలు వచ్చినప్పుడు భయపడుతూ ఏమైనా అవుతుందేమో అని ఆందోళన చెందుతూ ఉంటారు. ఇకపోతే మామూలుగా కలల్లో మనకు అప్పుడప్పుడు దేవుళ్లకు పూజ చేసినట్టు, దేవుళ్ళు కలలో కనిపిస్తూ ఉంటారు. అయితే అలా ఎప్పుడైనా మీకు విఘ్నేశ్వరుడు కలలో కనిపించాడా? అలా కనిపిస్తే దాని అర్థం ఏంటో, ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
విగ్నేశ్వరుడు.. మనం ఎలాంటి శుభకార్యం మొదలు పెట్టినా కూడా మొదటి పూజించేది విఘ్నేశ్వరుడిని. ఆయనకు పూజ చేసిన తరువాతనే కార్యాలు మొదలు పెడుతూ ఉంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అందుకోసం విగ్నేశ్వరుడిని మొదటిగా పూజిస్తూ ఉంటారు. అలాంటి విఘ్నేశ్వరుడు మనకు కలలో కనిపిస్తే విజయం, శ్రేయస్సు లభిస్తుందని అర్థం అంటున్నారు. గణేష్ ఉత్సవ్ సమయంలో గణేశుడిని కలలు కనడం మీ ప్రార్థనలు, కోరికలు నెరవేరబోతున్నాయనే సంకేతంగా కూడా అర్థం చేసుకోవచ్చట. విజయానికి దేవుడు , అడ్డంకులను తొలగించేవాడు, కలలో వినాయకుడి దర్శనం మీరు మీ లక్ష్యాలను సాధించే అంచున ఉన్నారని, ఏవైనా ఇబ్బందులు లేదా ఏవైనా అడ్డంకులు ఉన్నా కూడా ఆ సమస్యలు తొందర్లోనే తొలగిపోతాయని అర్ధం అంటున్నారు.
అలాగే మనం ఏదైనా పనిని మొదలుపెట్టాలి అంటే ముందుగా వినాయకుడిని పూజిస్తాము. కొత్త ప్రారంభానికి అధిపతిగా ఆ వినాయకుడిని సూచిస్తారు. అలాంటి స్వామి వారు కలలో కనిపించాడు అంటే మీ జీవితంలో ఏదో కొత్త అధ్యాయం మొదలౌబోతోంది అనడానికి సంకేతం అని అంటున్నారు. ఒకవేళ ఈ పండుగ సమయంలో అనగా వినాయక చవితి నవరాత్రుల సమయంలోగణేశుడు కలలో కనిపిస్తున్నాడు అంటే, మీకు నెగిటివ్ ఎనర్జీ దూరమౌతుందని అర్థమట. అంతేకాదు మీరు కోరుకున్న విజయం కూడా మీకు లభించే అవకాశం ఉంటుందని అర్ధం అంటున్నారు.