వినాయకచవితి..హిందువుల సాంప్రదాయ పండగలలో ఇది ఒకటి. 9రోజులపాటు జరిగే పండుగను చిన్న చిన్న వీదుల్లో నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు వినాయకుడిని ప్రతిష్టించిన ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. అయితే వినాయక నవరాత్రుల్లో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ పండగ రోజున చంద్రుడిని చూడకూడదు. ఎందుకంటే చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వడంతో కోపోద్రుక్తులైన గణేషుడు చంద్రుడికి శాపం విధిస్తాడు. ఆ శాపంతోనే ఇప్పటి వరకు వినాయకచవితి రోజున చంద్రుడిని చూడకూడదు అని చెబుతుంటారు.
వినాయక నవరాత్రుల్లో చవితి రోజున ఇంట్లో ఎలుక కనిపిస్తే కొన్ని శుభాలు, కొన్ని అశుభాలు ఉన్నాయని శాస్త్రాల్లో పేర్కొనబడింది. వినాయకుడి వాహనమైన ఎలుక కనిపిస్తే అశుభాలుఎందుకు అనుకుంటున్నారా. ఈ 9 రాత్రుల్లో ఇంట్లో నుంచి ఎలుక బయటకు వెళ్తుండగా మీ కంట పడినట్లయితే…అది శుభసూచకం. పేదరికం, కష్టాలన్నీ తొలగిపోతాయనడానికి ఇది సంకేతం. అంతేకాదు మీ ఇంట్లో సంతోషం నెలకొంటుందని చెప్పడానికి అర్థం. తెల్ల ఎలుక కనిపించినా శుభమే. ఎందుకంటే తెలుపు సానుకూలతకు చిహ్నం.
తెల్ల ఎలుక కనిపిస్తే రాబోయే కాలంలో మీకు మంచి జరుగుతుందని అర్థం. నిద్రలేవగానే ఎలుకను చూడటం మాత్రం అశుభమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. నవరాత్రుల్లో ఎలుకను ఎట్టిపరిస్థితుల్లో చంపకూడదు. ఒకవేళ చంపితే ఇంట్లో ఎవరి ఆరోగ్యమైన క్షీణించవచ్చు. భారీ నష్టాన్ని చూడాల్సి ఉంటుంది. కాబట్టి గణేశ నవరాత్రుల్లో ఎలుకను చంపకూడదు.