Crow: కలలో కాకి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా మనం పడుకున్నప్పుడు ఎన్నో రకాల కలలు, పీడకలలు, భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి.

Published By: HashtagU Telugu Desk
Crow

Crow

సాధారణంగా మనం పడుకున్నప్పుడు ఎన్నో రకాల కలలు, పీడకలలు, భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. కొంతమంది పీడకలలు భయంకరమైన కలలు వచ్చినప్పుడు అవి నిజమవుతాయేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. కలలో పక్షులు, జంతువులు, ఆహారం, చావు, శుభకార్యాలు ఇలా ఒక్కొక్క రకమైన కలలు వస్తూ ఉంటాయి. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం కలలో కనిపించే ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క అర్థం కారణం ఉంటుంది. పడుకునే సమయంలో మనం ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తే అందుకు సంబంధించిన కలలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి పడుకునేటప్పుడు ఎటువంటి విషయాలు ఆలోచించకుండా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పడుకోవాలి.

ఒకవేళ మనం పడుకున్నప్పుడు కలలో కాకి కనిపిస్తే అది దేనికి సంకేతం? అది శుభమా లేక అశుభమా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా కాకిని అశుభ సూచికంగా చెబుతూ ఉంటారు. కాకి మృత్యుదేవత యమరాజుతో సంబంధం కలిగి ఉంటుందని కొంత‌మంది విశ్వసిస్తూ ఉంటారు. ఒక కాకి కలలో కనిపిస్తే అది సాధారణంగా అసహ్యకరమైన సంఘటనలకు అర్థం అని చెప్పవచ్చు. కానీ కలలో కాకిని చూడటం ఎల్లప్పుడూ దురదృష్టం ,అశుభం కాదు, కొన్నిసార్లు కాకిని చూడటం కూడా శుభప్రదం అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. క‌ల‌లో కాకి భయంకరమైన శబ్దం చేసిన‌ట్లు అనిపిస్తే ఇంట్లో ఏదో చెడు జరగబోతోందని అర్థం.

ఎగిరే కాకిని కలలో చూడటం మంచి కాదు. కలలో కాకి ఎగురుతున్నట్లు క‌నిపిస్తే మానసిక సమస్యలను ఎదుర్కోంటారని అర్థం. అంతేకాకుండా ఇబ్బందుల్లో ప‌డి సమయం, డబ్బు రెండింటి వృథా అవుతుందట. కాకి తలపై కూర్చున్న‌ట్లు క‌ల వ‌స్తే చెడు జ‌రుగుతుంది. కలలో కాకి మీ తలపై కూర్చోవడం మరణానికి సంకేతం అని చెప్పవచ్చు. కలలో మరణానికి సంబంధించి అలాగే కాకి కలలో తలపై కూర్చున్నట్టు రాకుండా ఉండాలి అంటే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అలాగే కలలో కాకిని పట్టుకున్నట్లు అనిపిస్తే శుభసూచకమ‌ట‌. ఇలా జ‌రిగితే కుటుంబ అవసరాలు తీరుతాయి.

  Last Updated: 01 Mar 2023, 08:47 PM IST