Auspicious Signs: అప్పులతో బాధపడుతున్నారా? అయితే పూజగదిలో ఈ 5వస్తువులు పెట్టండి…!!

  • Written By:
  • Publish Date - November 20, 2022 / 11:25 AM IST

నేటికాలంలో పెరుగుతున్న ఖర్చులు, తగినంత ఆదాయం లేకపోడంతో చాలా మంది అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉండటంతో లేదు. దీంతో చాలామంది మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. కొంతమందికి ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో చిల్లిగవ్వ మిగలదు. మరికొందరికి వ్యాపారంలో నష్టాలు వేధిస్తుంటాయి. అయితే వీటన్నింటికి పరిష్కారం దొరకాలంటే వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి. కొందరికి శాస్త్రాలపై నమ్మకం ఉండదు. అలాంటివారి గురించి ప్రస్తావించడం లేదు. కొంతమంది కష్టపడి పనిచేయడంతో తమ అద్రుష్టాన్ని నమ్ముతుంటారు. అలాంటివారు ఆర్థిక సమస్యల నుంచి వీలైనంత త్వరగా బయటపడాలంటే మీ ఇంట్లోని పూజగదిలో ఈ ఐదు రకాల వస్తువులను చేర్చండి. ఎలాంటి శుభసూచికలను చేర్చాలో తెలుసుకుందాం.

స్వస్తిక
పూజగదిలో పసుపుతో స్వస్తిక చిహ్నాన్ని పెట్టాలి. స్వస్తిక చిహ్నం హిందూమతంలో అత్యంత పవిత్రమైంది. స్వస్తిక్ గీయడం వల్ల ఆ ఇంట్లో శాంతి, సంతోషాలు కలుగుతాయి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో శాంతిం, ఆనందం, ప్రశాంతత శ్రేయస్సు కూడా ఉంటుంది.

ఓం
పూజగదిలో కుంకుమ లేదా చందనంతో ఓం చిహ్నాన్ని ఉంచడం శుభసూచకం. ఓ పఠించడం వల్ల జీవితానికి బలాన్ని ఇస్తుంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలుగుతాం. పలు రకాల సమస్యలు, వ్యాధులను నాశనం చేసే శక్తికి ఓంకు ఉంటుంది. అదేవిధంగా ఓం చిహ్నాన్ని ఇంట్లో ఉంచినట్లయితే ఆ ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.

శ్రీ , మంగళ కలశం
కలశం లక్ష్మీదేవికి ప్రతీక. పూజగదిలో దీనికి ఉండచం చాలా శుభప్రదం. అంగారక కలశం ఆనందం, శ్రేయస్సుకు చిహ్నం. పూజగదిలో దీన్ని ఉంచినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

లక్ష్మీదేవి పాదాలు, ఆవు డెక్కలు
పూజగదిలో లక్ష్మీదేవి పాదముద్రలు, ఆవుడెక్కలు ఉంచాలి. ఈ రెండు కూడా శ్రేయస్సుకు చిహ్నాలు. ఇంట్లో ఈ గుర్తులను ఉంచినట్లయితే సంపదను ఆకర్షిస్తుంది. కాబట్టి వీటిని మర్చిపోకుండా పూజగదిలో ఉంచండి.

కమలం
తామరపువ్వు శ్రీ హరి, లక్ష్మీదేవికి చిహ్నం. పూజగదిలో అష్టకమల పుష్ఫాన్ని ఉంచాలి. దీనికి లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.