Kartika Purnima 2022: కార్తీక పౌర్ణమి రోజు ఇలా పూజ చేస్తే చాలు.. అప్పులు మొత్తం తీరిపోతాయి?

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి ఉన్న ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలిసిందే. అన్ని మాసాలలో కార్తీకమాసం

  • Written By:
  • Publish Date - November 8, 2022 / 06:30 AM IST

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి ఉన్న ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలిసిందే. అన్ని మాసాలలో కార్తీకమాసం ఉత్తమైనదిగా భావిస్తారు. పురాణాల ప్రకారం శ్రీహరి విష్ణువు ఈ మాసంలో మస్యావతారం ఎత్తారు. రేపు అనగా 2022 నవంబర్ 8న కార్తీక పూర్ణిమ. ఈ కార్తీక పూర్ణిమ రోజు ఏమి చేయాలి ఎటువంటి పూజలు ఆచరించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కార్తీక పూర్ణిమ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి దానం చేయడం వల్ల మాసమంతా పూజించనంత ఫలితం కలుగుతుందట. అలాగే కార్తిక పూర్ణిమ రోజున కొన్ని రకాల పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండడంతో పాటు సంపద ఆహారం కి ఎటువంటి లోటు ఉండదట.

కార్తీక పూర్ణిమ రోజున గంగా యమునా లాంటి పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల మంచి కలుగుతుంది. అలాగే చేతిలో కుశాన్ని తీసుకుని పవిత్ర నదిలో స్నానం చేసి దానధర్మాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది. కార్తీక పూర్ణిమ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రధాన ద్వారం వద్ద పసుపు కలిపిన నీటితో స్వస్తిక్ గుర్తు వేసి మామిడి ఆకుల తోరణాలు కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే కార్తీక పూర్ణిమ రోజున పవిత్ర నది ఘాటు వద్ద దీపాన్ని వెలిగించడం వల్ల దేవతల అనుగ్రహం పొందడంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు విరబూస్తాయి.

అలాగే కార్తీక పూర్ణిమ రోజున తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. కార్తీక పూర్ణిమ రోజున శివుడుని భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. ఈ రోజున శివలింగంపై పాలు, పెరుగు,నెయ్యి, తేనె గంగాజలం పంచామృతం సమర్పించడం ద్వారా ఆ బోలా శంకరుడు సంతోషించి అష్టైశ్వర్యాలు కలిగిన దీవిస్తాడు. అప్పులు మొత్తం తీరిపోతాయి