Vastu : ఇంటి గుమ్మం ముందు ఈ చిన్న మార్పులు చేస్తే…లక్ష్మీదేవి కటాక్షిస్తుందట..!!

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 08:27 PM IST

ఇంటికి ప్రధాన గుమ్మం ముఖ్యం. వాస్తుప్రకారం మెయిన్ డోర్ బాగుంటే ఇంట్లో సంతోషం, శ్రేయస్సు నెలకొంటుంది. ఎందుకంటే ఇంటి ప్రధాన గుమ్మం నుంచే ఇంట్లోకి శక్తి ప్రవేశిస్తుంది. అందుకే ఎలాంటి పొరపాట్లు ఉండకూడదంటారు వాస్తు నిపుణులు. మీ ఇంటి ప్రధాన గుమ్మం ఏ దిశలో ఉందనేది కూడా చాలా ముఖ్యం. వాస్తుప్రకారం ఆరోగ్యాన్ని సంపదను, సామరస్యాన్ని, అదృష్టాన్ని పెంపొందించే ప్రాణాధార శక్తిని లోపల లేదా బయట ఉంచేందుకు ప్రదాన ద్వారం ముఖ్యం.

మీ ఇంటి ప్రవేశద్వారం సరిగ్గా లేకుంటే చాలా విషయాలు ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇంటి ప్రధాన తలుపు ఇంట్లోని ఇతర తలుపుల కంటే పెద్దదిగా ఉండాలని…సవ్యదిశలో ఉండాలని నమ్ముతారు. మీ ఇంటి ప్రధాన తలుపును సరియైన దిశలో ఉంచినట్లయితే..మీ ఇంట్లోకి సంపద శ్రేయస్సును ఆకర్షిస్తుంది. వాస్తు నిపుణుల ప్రకారం ప్రధాన ద్వారం ఎలా ఉంటే శాంతి నెలకొంటుందో తెలుసుకుందాం.

మీ ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం వైపున ఉన్నట్లయితే..దానికి సమీపంలో నీటి సంపును తప్పనిసరిగా ఉంచాలి. ఇంటికి మెయిన్ డోర్ దగ్గర సంపు ఉంచడం వల్ల ప్రతికూల శక్తిని నిరోధిస్తుంది. నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించకుండా సహాయపడుతుంది.

ఇంటికి ప్రధాన గుమ్మం వద్ద డస్ట్ బిన్ ఉంచకూడదు. ఇలా ఉంచితే దురదృష్టాన్ని ఆకర్షించే అవకాశం ఉంటుంది. పూజగది దగ్గర, పడకగదిలో లేదా మెట్ల కింద డస్ట్ బిన్ ఉంచకూడదు. డస్ట్ బిన్ ఎప్పుడూ కూడా సరైన స్ధానంలో ఉంచేలా చూసుకోవాలి. డస్ట్ బిన్ తూర్పున ఉంచడం వల్ల మీ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. వాయువ్యానికి పశ్చిమాన, ఆగ్నేయాని దక్షిణంగా, ఆగ్నేయానికి తూర్పున, నైరుతి దిశకు దక్షిణంగా ఉంచవచ్చు.

ఇంటి ప్రధాన ద్వారం దక్షిణవైపు ఉంటే…అక్కడ పంచముఖి హనుమాన్ చిత్రపటం ఉంచాలి. పంచముఖి హనుమాన్ ఇంట్లో ఉండటం వల్ల ఆటంకాలు తొలగిపోయి, ఇంట్లో శ్రేయస్సు ఉంటుంది. దీంతోపాటు ప్రవేశద్వారం వద్ద పంచముఖి హనుమాన్ విగ్రహం లేదా బొమ్మను ఉంచడం వల్ల దుష్టశక్తులు, ప్రతికూల శక్తులతో పోరాడుతుంది.

మీ ఇంటి మెయిన్ డోర్ పశ్చిమంలో ఉన్నట్లయితే..వినాయకుని విగ్రహం ఉంచాలి. వినాయకుడి విగ్రహం ప్రధాన ద్వారం వద్ద లోపలికి ఉండాలి. వినాయకుని బొమ్మను ఉంచినట్లయితే…అది ఇంటి ప్రధాన ద్వారంవైపు ఉండాలి. గణేషుడి విగ్రహం దక్షిణ దిశలో ఉంచకూడదు.

ఇక ప్రధాన తలుపులను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచాలి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి కటాక్షిస్తుందట.