Site icon HashtagU Telugu

Money Plant: ‎మనీ ప్లాంట్ పెంచుతున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..!

Money Plant

Money Plant

Money Plant: వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అందులో మనీ ప్లాంట్ కూడా ఒకటి. ఈ మొక్క డబ్బును ఆకర్షిస్తుందని నమ్మకం. డబ్బును ఆకర్షించే మొక్కలలో మనీ ప్లాంట్ మొదటగా ఉంటుంది. అందుకే చాలా ఇళ్లలో మనీ ప్లాంట్లు పెంచుతున్నారు. కానీ మనీ ప్లాంట్‌ ను నాటడం గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల, చాలాసార్లు ఈ మొక్క ప్రయోజనాలకు బదులుగా హాని కలిగిస్తుంది. మనీ ప్లాంట్‌ కు సంబంధించి చేయకూడని తప్పులు ఉన్నాయి.

‎అవి చాలా ఖరీదైనవి. ఆర్థిక సంక్షోభాన్ని కలిగిస్తాయట. మనీ ప్లాంట్ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కాపాడుతుందట. మనీ ప్లాంట్‌ మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందట. ధన ప్రవాహాన్ని పెంచుతుందని చెబుతున్నారు. దీని గురించి వాస్తు శాస్త్రంలో కూడా ప్రస్తావించారు. ఇలాంటి కారణాలతో ఇప్పుడు చాలా మంది తమ ఇళ్లల్లో మనీ ప్లాంట్స్ పెంచుతున్నారు. ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులను తరచుగా ప్రభావితం చేయకుండా మనీ ప్లాంట్ నిరోధిస్తుందని చెబుతారు. ఇంట్లో మనీ ప్లాంట్‌ ఉంటే, అది ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోవాలట. మనీ ప్లాంట్‌ ఎండిపోవడం అశుభం.

‎ఇది ధన నష్టాన్ని కలిగిస్తుందట. మనీ ప్లాంట్ ఎండిపోతే దాన్ని తొలగించి కొత్త మనీ ప్లాంట్ నాటాలట. మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతే వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలట. మనీ ప్లాంట్‌ను ఇంటి బయట ఎప్పుడూ నాటకూడదట. టెర్రస్ లేదా బాల్కనీలో నాటవచ్చు. కానీ మనీ ప్లాంట్ మెయిన్ డోర్ బయట ఉండకూడదట. దీనివల్ల ఇంట్లో సంపద నిలవదని, మనీ ప్లాంట్‌ ను ఇండోర్ ప్లాంట్‌గా ఇంట్లో నాటడం ఉత్తమం అని చెబుతున్నారు.

Exit mobile version