Tulasi Vastu: తులసి చెట్టులో ఈ ఒక్క వస్తువు ఉంచితే చాలు.. డబ్బే డబ్బు?

భారతదేశంలో హిందువులు ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతోపాటు దేవతగా భావించి భక్త

Published By: HashtagU Telugu Desk
Tulasi Vastu

Tulasi Vastu

భారతదేశంలో హిందువులు ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతోపాటు దేవతగా భావించి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. తులసి మొక్కను పూజించడం వల్ల తులసి అనుగ్రహంతో పాటుగా విష్ణువు,లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతేకాకుండా తులసి మొక్కను బట్టి ఆ ఇంట్లో పరిస్థితులను అంచనా వేయవచ్చు. ఇంట్లో తులసి మొక్కను పూజించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తులసి నివారణలు అదృష్టాన్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగే సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తులసి మొక్కను పూజించడంతో పాటుగా తులసి మొక్కలో ఈ ఒక్క వస్తువు ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అయ్యి డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. కాగా శాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బు లేకపోవడం, డబ్బు లేనివారు, శత్రుత్వం, చాలా టెన్షన్ ఉన్నవారు ఈ తులసి పరిహారం చేయాలి. అందుకు తులసి మొక్కకు నీటికి బదులు చెరుకు రసాన్ని నైవేద్యంగా పెట్టాలి.

చెరకు రసం తీసుకుని ఏడుసార్లు తులసి మంత్రాన్ని జపించిన తర్వాత తులసి మూలాన వదిలేయండి. దీంతో సంపద లోటు తొలగిపోతుంది. మూడేళ్లలో ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. లక్ష్మికి ఎప్పటికీ లోటు ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందాలంటే రోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మాతకు తప్పకుండా నీళ్ళు సమర్పించాలి. అదేవిధంగా తులసి మొక్క దగ్గర ఉదయం సాయంత్రం రెండు పూటలా దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. అలాగే మెడలో తులసి హారాన్ని ధరించడం వల్ల కూడా మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయి.

  Last Updated: 25 Jul 2023, 06:52 PM IST