Dreams: కలలో ఈ పువ్వు కనిపిస్తే.. ఇక డబ్బే డబ్బు?

సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే అందులో కొన్ని మంచి కథలు వస్తే మరికొన్ని భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి.

Published By: HashtagU Telugu Desk
Dreams

Dreams

సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే అందులో కొన్ని మంచి కథలు వస్తే మరికొన్ని భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. అయితే భయంకరమైన కలలు వచ్చినప్పుడు చాలా మంది అలా జరుగుతుంది ఏమో అని భయపడుతూ ఉంటారు. నిపుణులు కూడా మనకు వచ్చే కలలు కొన్ని నిజం అవుతాయి అని చెబుతూ ఉంటారు. అవి చెడ్డ కళలైనా మంచి కళలైనా కూడా. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం మనకు రెండో రకాల కలవరింపులు వస్తాయి.

అందులో మొదటిది గతంలో జరిగిన విషయాలు, అలాగే భవిష్యత్తులో జరగబోయే విషయాలు. స్వప్న శాస్త్ర ప్రకారం ప్రతి కలకి కూడా ఒక అర్థం ఉంటుంది. అలాగే కలలో కనిపించే కొన్ని రకాల వస్తువులు కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. అయితే మనకు కలలో పూలు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ పువ్వు మరేదో కాదు తామర పువ్వు. తామర పువ్వు కలలో కనిపించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Lotus

కలలో తామర పువ్వు కనిపించడం అన్నది మంచి సంకేతంగా భావిస్తారు. తామర పువ్వు కలలో కనిపించడం అన్నది భవిష్యత్తుకు మంచి సంకేతం అని చెప్పవచ్చు. ఎవరైనా కలలో తామర పువ్వులు చూసినట్లయితే తొందరలోనే వాళ్లు ధనవంతులు కాబోతున్నారు అని అర్థం. అంతేకాకుండా అటువంటి వారికి కొత్త ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి. అలాగే మనకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే అది మన చేతికి అందుతుంది. అలాగే కలలో తామర పువ్వు కనిపించడం అన్నది జ్ఞాన సాధనకు మార్గంగా కూడా పరిగణిస్తారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు కలలో తామర పువ్వు కనిపిస్తే త్వరలోనే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతాడు అని చెప్పవచ్చు.

  Last Updated: 28 Sep 2022, 10:56 PM IST