Site icon HashtagU Telugu

Lakshmi Devi: లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే.. ఎలాంటి లక్షణాలు ఉండకూడదో తెలుసా?

Lakshmidevi

Lakshmidevi

మామూలుగా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు, నోములు వ్రతాలు దానధర్మాలు వంటివి చేస్తూ ఉంటారు. అయితే వాటితో పాటు లక్ష్మీ అగ్రహారం కలగాలంటే కొన్ని రకాల లక్షణాలు ఉండకూడదు అని చెబుతున్నారు పండితులు. మరి ఎలాంటి లక్షణాలు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అయితే ఈ రోజున ద్వాదశాక్షర మంత్రమైన ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మీయే హ్రీం రిం సిధ్వాయే మమ అగాచ్చగచ్చ నమ: స్వాహా అనే మంత్రాన్ని జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట.

ఇకపోతే ఎలాంటి లక్షణాలు ఉండకూడదు అన్న విషయానికి వస్తే.. తీవ్రమైన కామ వాంఛ ధర్మ, కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలు లేకుండా, తీవ్రమైన కామవాంఛ కలిగిన వ్యక్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదట. అహంకారం, అజ్ఞానంతో వ్యవహరించే కుటుంబం, వ్యక్తులు ఉన్న దగ్గర కూడా లక్ష్మీ కటాక్షం ఉండదట. ఎవరైతే అహంకారం, అజ్ఞానంలో మునిగి తేలుతుంటారో, నిత్యజీవన విధానాన్ని నిర్లక్ష్యం చేస్తారో అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఎప్పటికి నివసించదని చెబుతున్నారు. అలాగే లక్ష్మీదేవి దురాశపరుల దగ్గర క్షణకాలం కూడా నివసించదట. దురాశ, కర్మ కన్నా పెద్దది. కాబట్టి దురాశపరుల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు.

హింస తమ విశ్రాంతి కోసం అమాయక జంతువులు, మానవులకు హాని చేసే వ్యక్తులు, ప్రాంతాల దగ్గర లక్ష్మీదేవి నివసించదు. మహిళలను అవమానిస్తే మహిళలపై క్రూరత్వం లేదా వారి పరువు తీసే స్థలాలలో, అలాంటి వ్యక్తులు ఉండే దగ్గర లక్ష్మీదేవి అనుగ్రహం ఏమాత్రం లభించదు. అంతేకాదు ఆమె ఆగ్రహానికి గురవుతారట. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనుకున్న వారు పైన చెప్పిన లక్షణాలను అసలు ప్రదర్శించకూడదని అలాంటి లక్షణాలను కూడా కలిగి ఉండకూడదని చెబుతున్నారు. తెలివి, న్యాయం, గౌరవం ఉండేవారి ఇంట్లో, అలాంటి వ్యక్తుల దగ్గర లక్ష్మి దేవి అనుగ్రహం అనునిత్యం ఉంటుంది. అగౌరవం ఇంటికి వచ్చిన అతిథిని అగౌరవ పరిచడం, అగౌరవపరిచి మాట్లాడటం, వారిని రిక్తహస్తాలతో, ఖాళీ కడుపుతో తిరిగి పంపేవాళ్ల దగ్గర లక్ష్మీదేవి నివసించదు. అతిథిని గౌరవించి, కడుపునిండా భోజనం పెట్టి, గౌరవించి పంపే వాళ్ల ఇంట్లో అపారమైన సంపద, శ్రేయస్సు ఉంటుందట. భార్యాభర్తలు ఎక్కడైతే భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా, అర్థం చేసుకుని కలిసి నివసిస్తారో వారిని లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుందట.