Site icon HashtagU Telugu

Hinduism : శ్రీరాముని ఈ 4 గుణాలు మీలో ఉంటే మీరు శ్రీరాముడి లాంటి వారే..!

Sriramanavami

Sriramanavami

అధర్మాన్ని జయించిన శ్రీరాముడు, రావణుడిని సంహరించి, అతని బారి నుండి సీతను రక్షించిన పురుషోత్తముడు. రాముడు ఎప్పుడూ నీతిని, సత్యాన్ని ఎలా సమర్ధించాడో తెలుసా..? శ్రీరాముని మంచి గుణాల కారణంగా ఆయనను మర్యాద పురుషోత్తమ అని గ్రంధాలలో సాధారణ పరిభాషలో పిలుస్తారు. ఒక వ్యక్తి శ్రీరామునిలోని కొన్ని లక్షణాలను కలిగి ఉన్నట్లయితే అతను విజయపథంలో నడుస్తాడు. మన జీవితంలో శ్రీరాముని గుణాలను ఎలా అలవర్చుకోవాలో తెలుసా?

1. సహనం, ధైర్యం:
శ్రీరాముడు ప్రతి సందిగ్ధంలో ఓర్పుతో సమస్యలను పరిష్కరించాడు. 14 సంవత్సరాల వనవాసాన్ని ఓపికగా పూర్తి చేశాడు శ్రీరాముడు. ఒక వ్యక్తి ఈ గుణాన్ని పొందినట్లయితే.. అతను కూడా విజయపథంలో నడుస్తాడని నమ్ముతారు.

2. వ్యక్తిత్వంలో దయ:
శ్రీరాముని స్వభావం ఎప్పుడూ దయతో ఉండేది. సన్యాసి వేషంలో, రాజు హోదాలో అందరిపట్ల సమానమైన దయా భావాన్ని కొనసాగించాడు. సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇవ్వడం, పేద శబరి ప్రసాదించిన పండ్లను ప్రేమతో, గౌరవంతో తినడం శ్రీరాముడి దయను మనకు తెలియజేస్తుంది.

3. మంచి స్నేహితుడు:
అయోధ్య రాజుగా 14 సంవత్సరాల అజ్ఞాతవాసంలో ఉన్నప్పటికీ, శ్రీరాముడు అక్కడ కలుసుకున్న ప్రతి ఒక్కరికీ స్నేహితుడిగా ఉన్నాడు. అతను ఈ స్నేహాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు. పడవ నడిపే వారైనా, సుగ్రీవుడైనా, విభీషణుడైనా, అందరినీ ముక్తకంఠంతో స్వాగతించాడు శ్రీరాముడు.

4. సోదరులపై ప్రేమ:
శ్రీరాముడు తన సోదరులపై ఉన్న ప్రేమ ప్రస్తుత కాలంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత కూడా, తన తమ్ముళ్లు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుల పట్ల ఆయనకున్న అభిమానం అయోధ్యను విడిచిపెట్టే ముందు కూడా అలాగే ఉంది.

ఈ పైన పేర్కొన్న శ్రీరాముని గుణాలను మన జీవితంలో అలవర్చుకోవడం ద్వారా మనం మంచి జీవితాన్ని పొందవచ్చు. విజయం సాధించవచ్చు. శ్రీరాముని ఈ గుణాలు మిమ్మల్ని ఎల్లప్పుడూ సన్మార్గంలో ఉంచుతాయి.

Exit mobile version