Site icon HashtagU Telugu

Girl Child :మీకు ఆడపిల్ల ఉంటే…అదృష్టవంతులే..ఎందుకో తెలుసా..?

Indian Little Girl Standing On A Sand Dune In Desert Village, Rajasthan, India.

Indian Little Girl Standing On A Sand Dune In Desert Village, Rajasthan, India.

ఆడపిల్ల ఉన్న ఇల్లు లక్ష్మీదేవితో సమానం. అందుకే ఆడపిల్ల ఉండాలని కోరకుంటారు. మీకు ఆడపిల్ల ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసుకుందాం.

-ఆడపిల్ల ఉన్న ఇంట్లో నిత్యం సంతోషం ఉంటుంది. ఆమె నవ్వినా..మాట్లాడినా..ఆ ఆనందమే వేరుంటుంది. ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరిగినట్లే ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే..మీ ఇల్లు దేవాలయంతో సమానం.
-ఆడపిల్ల పుట్టిందని చాలా మంది బాధపడుతుంటారు. కానీ ఆడపిల్లే ఆ ఇంటికి అందమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
-ఇంట్లో ఎంతమంది మగాళ్లు ఉన్నా ..ఆడపిల్ల లేని లోటును పూడ్చలేరు.
-ఆడపిల్లలకు ప్రేమానురాగాలు తెలుసు. విలువుల కూడా బాగా తెలుసు.
-ఈ కాలంలో ప్రతివిషయంలోనూ ఆడపిల్లలే ముందుంటున్నారు. మగాళ్లకంటే ఆడపిల్లలే అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. తమ బలమేంటో నిరూపిస్తున్నారు. చదువు, ఉద్యోగాల్లోనూ వారిదే పై చేయి.
-మీఇంట్లో ఆడపిల్లలు ఉన్నందుకు మీరు గర్వపడండి.