Own House: సొంత ఇంటి కల నెరవేరాల.. అయితే ఈ పరిహారాలను పాటించాల్సిందే?

జీవితంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కల అనే ఒకటి ఉంటుంది. ఈ సొంతింటి కల కోసం ఎంతోమంది కలలు కంటూ

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 06:30 AM IST

జీవితంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కల అనే ఒకటి ఉంటుంది. ఈ సొంతింటి కల కోసం ఎంతోమంది కలలు కంటూ వాటిని సహకారం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొందరికి కలలు నిజమవుతూ వారికి నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకుంటూ సొంత ఇంటి కలలను నెరవేర్చుకుంటూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే చాలామందికి సొంత ఇంటి కలవ నెరవేర్చుకోవడంలో ఎన్నో రకాల అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అనుకున్న వారు కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల మీ సొంత ఇంటి కల తొందరగా నెరవేర్చుకోవచ్చు. అందుకోసం మరి ఎటువంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సొంతింటి కల నెరవేరాలి అనుకున్న వారు అంగారకుడు పూజించడం ఎంతో మంచిది. ఎందుకంటే గృహానికి రుణానికి అధిపతి అంగారకుడు. నిత్యం ఎవరైతే అంగారకుడిని పూజిస్తూ ఉంటారు వారికి సొంత ఇంటి కల తొందరగా నెరవేరుతుంది. అంతేకాకుండా అద్దె ఇంట్లో ఉండి బాధ పడుతున్న వారికి సొంత ఇంట్లోకి వెళ్లే భాగ్యం కూడా త్వరగా కలుగుతుంది. నవగ్రహాలలో అంగారక గ్రహం కూడా ఒకటి. అలాగే నవగ్రహాలలో సూర్యుడు చంద్రుడు తర్వాత మూడవ గ్రహం అంగారక గ్రహం. కుజుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి అందుకోసం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి రోజున అంగారకుడిని నుంచి భక్తిశ్రద్ధలతో విశేషంగా ఆరాధించాలి. అలాగే కుజుడు మంగళవారానికి అధిపతి. క్రిష్ణాంగారక చతుర్దశి మంగళవారం వచ్చిందంటే ఆ రోజును చాలా విశేషమైన తిథిగా చెప్పవచ్చు.

ఆరోజున తప్పనిసరిగా కుజ వ్రతం చేయించాలి. అదేవిధంగా కుజుడికి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల మంచి జరుగుతుంది. ఇలా చేయడం వల్ల గృహ యోగం కలుగుతుంది.
అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుజుడి అనుగ్రహం కలిగి గృహ యోగం త్వరగా కలగాలంటే మంగళవారం నియమాలను కచ్చితంగా పాటించాలి. మంగళవారం రోజున ఇంటిలోని ప్రతి ఒక్కరూ కందిపప్పును తినకూడదు. అదేవిధంగా ఎరుపుకు సంబంధించినటువంటి పువ్వులు, ఫలాలను కూడా తినకూడదు. కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. కానీ వాటిని మీరు స్వీకరించకూడదు. మంగళవారం నియమాలను పాటిస్తే అంగారక అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అంతే కాకుండా సొంత ఇంటి కల ప్రయత్నంలో ఎటువంటి ఆటంకాలు ఉన్న అన్ని తొలగిపోతాయి. మంగళవార నియమాలను క్రమం తప్పకుండా ఇంటిల్లపాదీ పాటించాలి..