Site icon HashtagU Telugu

Dream: ఈ రకమైన కలలు వచ్చిన వెంటనే…దానం చేస్తే..ఇంట్లో డబ్బు, ఆహారం కొరత ఉండదు..!!

Dream Interpretation

Dream Interpretation

మనకు కొన్ని కలలు వస్తుంటాయి. అందులో మంచివి ఉంటాయి. పీడ కలలు ఉంటాయి. కానీ కొన్ని కలలు మనం చేయాల్సిన పనుల గురించి సూచిస్తుంటాయి. ఆ కలులను గుర్తుంచుకుని దేవుడే కలలో చెప్పాడెమో ఈ పనులు చేయమని అనుకుంటారు చాలామంది. ఈ కలలు వచ్చిన తర్వాత దానధర్మాలు చేయడం వల్ల కూడా మీకు అదృష్టం మేల్కొంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఇలాంటి పనులు చేయడం వల్ల ఇంటికి ఆహారం, డబ్బు కొరత ఉండదని నమ్ముతుంటారు. ఆ 5 రకాల కలలు ఏంటో చూద్దాం.

ఒక కలలో పూర్వీకులు
కలలో పూర్వీకులను చూడటం చాలా శుభప్రదం. పూర్వీకులు కలలో వచ్చి తమ పిల్లలు సుఖసంతోషాలతో ఉండాలని దీవిస్తారు. పూర్వీకులు తరచుగా కలలో కనిపించినట్లయితే…వారి ఆశీర్వాదం పొందేందుకు వారికి ఇష్టమైన కొన్నింటిని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల వారు సంతృప్తి చెందుతారు.

కలలో కుజుడు ముఖం
కలలో అంగారకుడిని చూడటం చాలా శుభ సంకేతంగా పరిగణిస్తారు. మీకు అలాంటి కల వస్తే భగవంతుడే ప్రత్యక్షం అయినట్లు. కలలో కనిపించిన వెంటనే దానధర్మాలు చేయాలి. గుడికి వెళ్లి బియ్యం, పండ్లు మొదలైనవి దానం చేస్తు అంతా శుభం జరుగుతుంది.

కలలో ఏడుస్తున్న పిల్లవాడు
ఏడుస్తున్న పిల్లవాడిని చూస్తే అతను మిమ్మల్ని ఏదో అడుగుతున్నట్లు అర్థం. అలాంటి పరిస్థితిలో మీరు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని ఏదైనా స్వచ్చంద కార్యక్రమాల్లో పెట్టండి. ఎర్రటి ఆవుకు ధాన్యం తినిపించాలి. పిల్లలకు పండ్లు దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలు తొలగిపోయి…భగవంతుని అనుగ్రహం లభిస్తుంది.

భగవంతుని రూపాన్ని చూడటం
మీకు కలలో దేవుడు కనిపిస్తే..మిమ్మల్ని మతపరమైన పనిచేసేందుకు ప్రేరేపించినట్లు అర్థం. అలాంటి కల వస్తే మీరు అమ్మాయి పెళ్లిలో కొంత సహాయం చేయాలి. లేదంటే చుట్టూ ఉన్న పేదవారికి ఏవైనా వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి.