Chaitra Navaratri: చైత్ర నవరాత్రుల్లో ఈ 5 కలలు వస్తే.. మంచి రోజులు క్యూ కట్టినట్టే..!

నవరాత్రి రోజుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలను పూజిస్తారు. నవరాత్రులలో కొన్ని ప్రత్యేక విషయాల గురించి కలలు కనడం కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.

Chaitra Navaratri 2023 : నవరాత్రి రోజుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలను పూజిస్తారు. నవరాత్రులలో కొన్ని ప్రత్యేక విషయాల గురించి కలలు కనడం కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి తన కలలో ఈ విషయాలను చూస్తే.. అతని అదృష్టం త్వరలో మారబోతోందని అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఈ శుభ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సింహంపై స్వారీ చేస్తున్న అమ్మవారిని చూడటం..

మీరు నవరాత్రులలో మీ కలలో సింహంపై స్వారీ చేస్తున్న అమ్మవారిని చూస్తే.. త్వరలో మంచి రోజులు రానున్నాయని అర్థం చేసుకోండి. అతి త్వరలో మీరు మీ శత్రువులపై విజయం సాధించబోతున్నారనడానికి ఇది సంకేతం. మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయి.

అలంకరణ సామగ్రి..

నవరాత్రులలో మీ కలలో అలంకరణ సామగ్రి కనిపిస్తే, దానిని శుభ సంకేతంగా పరిగణించండి.  మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని దీని అర్థం. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. మాతృమూర్తి అనుగ్రహం మీపై ఉందనడానికి ఇది సంకేతం.

కలలో గాజులు కొనడం..

మీరు నవరాత్రుల పవిత్ర రోజులలో కలలో కంకణాలు కొంటున్నట్లు చూసినట్లయితే.. ఇది వివాహ సంబంధిత సమస్యల పరిష్కారంతో ముడిపడి ఉంటుంది. వివాహం చేసు కోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తుల ప్రాబ్లమ్ సాల్వ్ కావచ్చు. త్వరలో మంచి పెళ్లి సంబంధం వారి ఇంటి తలుపు తట్టొచ్చు.పెళ్లి జరిగేందుకు రూట్ క్లియర్ కావచ్చు.

కలలో పండ్లను చూడటం..

మీకు కలలో పండ్లు కనిపిస్తే లేదా నవరాత్రి సమయంలో వాటిని తింటే, అది జీవితంలో శ్రేయస్సుకు సంకేతం. ఏ పని చేసినా దుర్గ మాత మీకు చాలా శుభ ఫలితాలను ఇవ్వబోతుందని అర్థం.  పెద్ద విజయం కూడా మీ చేతుల్లోకి రావచ్చు.

కలలో పాల మిఠాయిలు..

నవరాత్రులలో దుర్గామాతకు పాల మిఠాయిలు సమర్పిస్తారు. మీరు నవరాత్రులలో పాలతో చేసిన మిఠాయిలను చూస్తే.. అది ఏ పనిలోనైనా విజయానికి సంకేతం.  అంటే రాబోయే రోజుల్లో మీ గౌరవం పెరగవచ్చు. వృత్తి, వ్యాపారాలలో లాభాల శాతం పెరగొచ్చు.

Also Read:  TTD News: మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త!