Vastu tips: ఆర్థికంగా బలం చేకూరాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే?

ప్రస్తుత సమాజంలో మనుషులు ఎక్కువ శాతం మంది బంధాలు కంటే డబ్బుకి ఎక్కువగా విలువనిస్తున్నారు. దీంతో

  • Written By:
  • Publish Date - January 21, 2023 / 06:00 AM IST

ప్రస్తుత సమాజంలో మనుషులు ఎక్కువ శాతం మంది బంధాలు కంటే డబ్బుకి ఎక్కువగా విలువనిస్తున్నారు. దీంతో చాలామంది డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని ద్యేయంగా పెట్టుకొని రాత్రి పగలు కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. అయితే కొందరు కష్టపడి సంపాదించిన సొమ్ము పొదుపు చేస్తే ఇంకొందరు మాత్రం ఎంత పొదుపు చేసినప్పటికీ వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అవుతాయి అని బాధపడుతూ ఉంటారు. సంతోషం డబ్బును కొనకపోవచ్చు కానీ, డబ్బు మీ సంతోషాన్ని తీరుస్తుంది. అందుకే ప్రజలు డబ్బుకు ప్రాముఖ్యత ఇస్తారు. అయితే కేవలం డబ్బులు సంపాదించడం మాత్రమే కాదండోయ్ డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోవడంతో పాటు కొన్ని రకాల పరిహారాలు కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల డబ్బు చేతిలో మిగలడంతో పాటు ఆర్థిక సమస్యలు దూరం అయ్యి లక్ష్మి అనుగ్రహం లభించి మనకు రావాల్సిన డబ్బు ఇంకా అధికంగా వస్తుంది.

అయితే మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలు చెప్పబడ్డాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంటికి దక్షిణ దిశలో ఎత్తును ఉంచాలి. ఇంటి ఈశాన్య దిశలో ద్వారాలు ఉంటే డబ్బు ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అలాగె ఈశాన్య, తూర్పు తలుపు తెరిచి ఉంచడం కూడా డబ్బు తెస్తుంది. ఈశాన్యంలో సరిగ్గా కొలిచిన నీటి నిల్వ సంప్ కలిగి ఉండటం కూడా ధన ప్రవాహాన్ని ఇస్తుంది.

అదేవిధంగా భారీగా నిల్వ చేసిన వస్తువులను దక్షిణం వైపు ఉంచితే మంచిదట. నైరుతి కూడా డబ్బు తీసుకురావడానికి అనుకూలతను సూచిస్తుందట. పోర్టికోను ఉత్తరం వైపు వంచడం కూడా మంచి ఆదాయాన్ని సూచిస్తుందట. దక్షిణ దిశలో అపార్ట్‌మెంట్ ఉన్నప్పుడు డబ్బు ఇళ్లలో ఎక్కువ సమయం ఉంటుందట. పశ్చిమ దిశలో అపార్ట్మెంట్ డబ్బును వృద్ధి చేయడంలో శక్తిని కలిగి ఉంటుంది. నైరుతి వైపు భారీ నిర్మాణాలు, పెద్ద భవనాలు ఎల్లప్పుడూ ఎక్కువ డబ్బు సంపాదించడానికి సహాయపడతాయి.