Site icon HashtagU Telugu

Money: దారిలో డబ్బులు దొరికితే దేనికి సంకేతమో తెలుసా?

Money

Money

సాధారణంగా మనం అలా ఎప్పుడైనా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న సమయంలో మనకు రోడ్డు మీద డబ్బులు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది డబ్బు కనపడగానే వెంటనే తీసుకుని ఎవరికి కనపడకుండా జేబులో పెట్టుకుని వెళ్లిపోతారు. కొందరు ఆ డబ్బులు తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ చుట్టుపక్కల ఎవరి దగ్గరైనా డబ్బులు పోయాయేమో అని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే అలా ఆలోచిస్తారని చెప్పవచ్చు. కొంతమంది ఆ డబ్బులు తీసుకున్న కూడా ఎవరో ఒకరికి వాటిని దానం చేస్తూ ఉంటారు. అలా మనకు దొరికిన డబ్బును ఏం చెయ్యాలి? దానం చెయ్యాలా? లేక వాడుకోవాలా? దాచుకోవాలా? ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొన్ని కొన్ని సార్లు మనకు నోట్లు దొరకవచ్చు లేదంటే నాణేలు దొరకవచ్చు. అయితే ఇలా డబ్బు దొరకడం అన్నది భవిష్యత్తులో జరగబోయే అంశాలకు సంకేతం అని శాస్త్రం చెబుతోంది. కింద పడిన నాణేలు దొరికాయంటే దేవుడు మీ వెన్నంటి ఉన్నాడని అర్థం. ఆయన మీ విషయంలో చాలా ప్రసన్నంగా ఉన్నారని త్వరలోనే జీవితంలో ఏదో మంచి మార్పు జరగబోతోందనడానికి ఇది సంకేతం. ఎవరో పోగొట్టుకున్న డబ్బు మీకు దొరికిందీ అంటే మీరు త్వరలోనే ఏదో గొప్ప శుభవార్త వినబోతున్నారని అర్థం. నాణేలు సాధారణంగా ఏదో ఒక లోహంతో చేసి ఉంటాయి. కనుక అలాంటి నాణెం మీకు దొరికింది అంటే దైవానుగ్రహం మీకు లభించినట్టే.

కింద పడిపోయిన నాణెం కచ్చితంగా ఎవరో ఒకరి చేతి నుంచి జారిపడిపోయిందే అవుతుంది. అది కచ్చితంగా ఎంతో కొంత ఎనర్జీ కలిగే ఉంటుంది. ఆ నాణాన్ని మీతో ఉంచుకుంటే మీకు మంచి జరిగే అవకాశమే ఎక్కువ. త్వరలోనే మీరు పనిచేసే చోట మీకేదో మంచి జరగబోతోందనడానికి కూడా ఇది సంకేతం కావచ్చు. అంటే ప్రమోషన్ రావడం, వ్యాపారం విస్తరించడం వంటి విజయాలు వరిస్తాయి. ఇలా అనుకోకుండా డబ్బు దొరకడం లక్ష్మీ కటాక్షంగా భావించాలి. ఉదయాన్నే ఇలా డబ్బు దొరికితే అది సౌభాగ్యానికి గుర్తు. త్వరలోనే మీరు ఉన్నత స్థితికి చేరబోతున్నారని అర్థం. కాబట్టి ఈ డబ్బును జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఆశించకుండా రోడ్డుమీద దొరికిన నాణెం త్వరలో కలిగే ఆకస్మిక ధన ప్రాప్తికి సంకేతం. ఆస్తులు సంపాదించుకుంటారనడానికి ఒక నిదర్శనంగా భావించాలి. దొరికిన డబ్బు గురించి ఎటువంటి అనుమానాలు అవసరం లేదని శాస్త్రం చెబుతోంది. అప్పటి వరకు మీరు ఎదుర్కోంటున్న కష్టాలకు అడ్డు కట్ట పడబోతోందనడానికి సంకేతం. దొరికిన డబ్బు ఈశ్వర కృపకు కారణం. జీవితంలో ఇక ముందు అన్ని మంచి రోజులే అనేందుకు సంకేతం. అనుకోకుండా దొరికిన డబ్బులు అప్పటి వరకు వివాదాల్లో ఉన్న పిత్రార్జిత ఆస్తి త్వరలోనే మీకు సొంతం అవతుందని చెప్పేందుకు శకునంగా కూడా భావించాలి.

Exit mobile version