Shani: శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారా.. అయితే ఆరోజు ఈ పని చేయాల్సిందే?

మామూలుగా శని దేవుని అనుగ్రహం కలిగితే ఎంతటి మీద వాడైనా గొప్పవాడు ధనవంతుడు అవడం ఖాయం. అదే ఒకవేళ శని దేవుని ఆగ్రహానికి కారకులైతే మాత్రం ఎందటి

  • Written By:
  • Publish Date - July 13, 2023 / 07:30 PM IST

మామూలుగా శని దేవుని అనుగ్రహం కలిగితే ఎంతటి మీద వాడైనా గొప్పవాడు ధనవంతుడు అవడం ఖాయం. అదే ఒకవేళ శని దేవుని ఆగ్రహానికి కారకులైతే మాత్రం ఎందటి కోటీశ్వరుడు అయినా కూడా బిచ్చగాడు అవడం ఖాయం. శని దేవుడు మనం చేసే మంచి చెడు పనులను బట్టి మనకు సుఖ సంతోషాలను ఇవ్వడం కష్టాలను ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. చెడు పనులు చేసే వారిని శని దేవుడు ఎప్పుడు ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. ఒకవేళ మీరు శని ప్రభావంతో ఇబ్బందులు పడుతుంటే శనివారం రోజు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శనివారం శనైశ్చ‌రుడికి ఇష్ట‌మైన రోజుగా భావిస్తారు. ఈ రోజు ప్రజలు దేవాలయాలకు వెళ్లి ఆయ‌న‌కు తైలాభిషేకం చేస్తారు. జాత‌కంలో శ‌ని ప్ర‌భావం కార‌ణంగా, ఒక వ్యక్తి తన జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటాడు. అదే స‌మ‌యంలో శని సానుకూల ప్ర‌భావంతో ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో పురోగతిని ఎవరూ ఆపలేరు. శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అనేక మార్గాలు పురాణాల్లో సూచించారు. వీటిలో శనైశ్చ‌రుడిని ప్రసన్నం చేసుకునేందుకు శ‌నివారం నాడు నల్ల కుక్కకు ఆహారం పెట్ట‌డం వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. నల్ల కుక్కను శని దేవుడి వాహనంగా భావిస్తారు.

ఆయ‌న‌ను ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం నల్ల కుక్కకు నెయ్యితో చేసిన రొట్టె తినిపించాలి. ఈ పరిహారం చేయడం ద్వారా, వారి జీవితంలో త్వరలో సానుకూల ప్రభావాలను చూస్తారు. శనివారం నాడు నల్లకుక్కను చూడటం ద్వారా మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే గ‌తంలో ఆగిపోయిన‌ మీ పనులన్నీ పూర్తవుతాయి. ఆవనూనెతో చేసిన ఆహార ప‌దార్థాల‌ను శనివారం నల్ల కుక్కకు తినిపిస్తే, రాహు-కేతువులకు సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయి. శని దేవుడే కాకుండా, కాల భైరవుడి వాహ‌నంగా నల్ల కుక్కను పరిగణిస్తారు. కాబట్టి నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం ద్వారా జీవితంలో ఎదుర‌య్యే తీవ్రమైన ప్రమాదాల‌ను నివారించవచ్చు. నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం ద్వారా కాలసర్ప దోషం వంటి భయంకరమైన దోషాలు తొలగిపోతాయి. శనివారం నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం వల్ల ప్రతికూల శక్తులు మీపై ఆధిపత్యం చెలాయించలేవు. శనివారం నల్ల కుక్కకి రొట్టెలు తినిపిస్తే మీ అప్పులన్నీ త్వరగా తీరుతాయి. మీరు పనిచేసే రంగంలో ఘ‌న‌ విజయం సాధిస్తారు. మీరు భ‌విష్య‌త్‌లో రుణం తీసుకోవలసిన అవసరం ఉండ‌దు.