Wednesday Tips : జీవితంలో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉండకూడదంటే.. బుధవారం రోజు ఈ విధంగా చేయాల్సిందే..

బుధవారం (Wednesday) మాత్రమే కాకుండా హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన మొదటి పూజ గణపతిని పూజిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - December 30, 2023 / 07:00 PM IST

Wednesday Tips : హిందూ మత విశ్వాసాల ప్రకారం బుధవారం విఘ్నేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ బుధవారం రోజున చాలామంది విఘ్నేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. కేవలం బుధవారం (Wednesday) మాత్రమే కాకుండా హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన మొదటి పూజ గణపతిని పూజిస్తూ ఉంటారు. గణపతికి పూజ చేసిన తర్వాతే ఆ శుభకార్యాన్ని మొదలు పెడుతూ ఉంటారు. అలాగే బుధవారం (Wednesday) రోజున గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని ఆయన అనుగ్రహం తప్పక కలుగుతుందని, తలపెట్టే పనుల్లో విజయం సాధిస్తామని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అయితే అదే విధంగా బుధవారం రోజున కొన్ని రకాల పనులు చేయడం వల్ల మనం కెరియర్ లో ఎదుర్కొంటున్న సమస్యలు కష్టాలు తొలగిపోతాయి అంటున్నారు పండితులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

మీరు మీ కెరీర్‌లో విజయం సాధించాలనుకుంటే, బుధవారం కొన్ని వస్తువులను దానం చేయడం మంచిది. ఇందుకోసం బుధవారం నాడు అవసరమైన వారికి పచ్చి వస్తువులను దానం చేయాలి. అంతేకాకుండా పచ్చని వస్త్రాలను దానం చేయవచ్చు. ఈ రోజు వివాహిత స్త్రీకి పచ్చని గాజులు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. వీటిని దానం చేయడం వల్ల కెరీర్‌లో ఉన్న ఆటంకాలు తొలగిపోయి విజయానికి బాటలు ప‌డ‌తాయి.

అలాగే శాస్త్ర ప్రకారం, మీరు గణేశుడి అనుగ్రహం పొందాలంటే, బుధవారం నాడు నియ‌మ‌, నిష్ఠ‌ల‌తో వినాయకుడిని పూజించాలి. పూజ సమయంలో ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే ఆ గణేశుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది. కొన్నిసార్లు బుధ దోషం కారణంగా ఒక వ్యక్తి తన కెరీర్‌లో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటాడు. మీకు కూడా బుధ దోషం ఉందని ఖచ్చితంగా తెలిస్తే వెంటనే బుధవారం బంగారు ఆభరణాలు ధరించడం మంచిది. బుధవారం బంగారు ఆభరణాలు ధరించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా బుధగ్రహం దుష్ప్రభావాలను తగ్గించడానికి ఇంటికి తూర్పు దిశలో ఎరుపు రంగు జెండాను ఉంచాలి. బుధవారం నాడు ఈ ప‌నులు చేస్తే వృత్తి జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. మీకు బుధ దోషం ఉంటే అది కూడా తొలగిపోతుంది.

Also Read:  Children Vaccinations: పిల్లల టీకా గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇవే..!