Site icon HashtagU Telugu

Navratri: నవరాత్రుల సమయంలో ఎలాంటి వస్తువులు దానం చేస్తే మంచి జరుగుతుందో తెలుసా

Navratri

Navratri

ప్రతి ఈ ఏడాది లాగే ఈ ఏడాది కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఇంకా ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు శరన్నవరాత్రులు జరగనున్నాయి. నవరాత్రులలో ఈ 9 రోజులలో అమ్మవారి 9 రూపాలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. నవరాత్రి రోజులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి శక్తిని పూజించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక అమ్మవారి అనుగ్రహం కలగడం కోసం విశేష పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే వాటితో పాటు ఈ దసరా పండుగ సందర్భంగా కొన్ని రకాల వస్తువులు దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.

దసరా పండుగ రోజు, ఈ నవరాత్రులలో ఎలాంటి వస్తువులు దానం చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నవరాత్రుల పవిత్రమైన తొమ్మిది రోజులలో, ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలకు ఎర్రటి గాజులను దానం చేయాలి. ఆడపిల్లలు ఎర్రటి గాజులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. సంతోషకరమైన హృదయంతో ఉన్న అమ్మాయిలకు ఎర్రటి గాజులు బహుమతిగా ఇవ్వడం వల్ల వారి ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చెబుతున్నారు. అలాగే నవరాత్రుల సమయంలో అరటి పండ్లు దానం చేయడం వల్ల మంచి జరుగుతుందట. ఇంట్లోకి ఆనందం శ్రేయస్సు లభిస్తుందని చెబుతున్నారు.

నవరాత్రుల పవిత్రమైన తొమ్మిది రోజులలో అరటిపండ్లను దానం చేసిన వ్యక్తి తన ఇంటిలో శ్రేయస్సు , పురోగతి లభిస్తుంది. ఇది వారి ఇంటిలో సంపద , శ్రేయస్సు అవకాశాలను పెంచుతుందని చెబుతారు. పేదరికం నుండి విముక్తిని కోరుకునే వారు అరటిపండును దానం చేయాలని చెబుతున్నారు. నవరాత్రుల తొమ్మిది రోజులలో పుస్తకాలను దానం చేయాలట. పుస్తకాలను దానం చేసే వ్యక్తి తన ఇంటిలోని మహాలక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందుతాడని చెబుతున్నారు.

ఈ నవరాత్రి పండుగ ఆదిశక్తికి అంకితం చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహాన్ని కొనుగోలు చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజలు చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లప్పుడు ఉంటుందట. అలాగే నవరాత్రులలో ఈ 9 రోజులలో వెండి వస్తువులు చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో ఏదైనా వెండి వస్తువును కొనుగోలు చేయడం ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.