‎Karthika Masam 2025: కార్తీకమాసంలో ఎలాంటి వస్తువులను దానం చేయాలో మీకు తెలుసా?

‎Karthika Masam 2025: కార్తీకమాసంలో దానధర్మాలు చేయడం మంచిదని చెబుతున్నారు. మరి ఈ మాసంలో ఎలాంటి వస్తువులను దానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Karthika Masam 2025

Karthika Masam 2025

Karthika Masam 2025: కార్తీక మాసం పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ కార్తీకమాసం సమయంలో అందరూ శివాలయాలకు వెళ్లి కార్తీక స్నానాలు ఆచరించి, కార్తీకదీపాలను వెలిగిస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు ఈ పవిత్ర మాసంలో కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి కార్తీకమాసంలో ఎలాంటి వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కార్తీకమాసం లో తులసి మాతకు పూజించడం, దీపాలు వెలిగించడం లాంటివి చేస్తూ ఉంటారు.

‎అయితే కేవలం దీపాలు వెలిగించడమే కాకుండా, కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని, పాపాలు తొలగిపోతాయని నమ్మకం. మరి ఈ కార్తీక మాసంలో ఏ వస్తువులను దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ పవిత్ర మాసంలో ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు నిద్రలేచి, స్నానం చేసి నది లేదా చెరువులో వాటిని వదలాలట. ఇలా నీటిలో దీపాలను వదలడం వల్ల శుభం కలుగుతుందని చెబుతున్నారు. సూర్యోదయానికి ముందే తులసి మొక్క ముందు నెయ్యి లేదా, నూనెతో దీపం వెలిగించడం వల్ల కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

‎ అలాగే హిందూ మతంలో ఆహారం దానం చేయడం గొప్ప దాన ధర్మంగా పరిగణిస్తారు. ఆహారం దానం చేయడం కంటే పవిత్రమైన దానం మరొకటి లేదట. కాబట్టి కార్తీక మాసంలో మీరు పేదలకు వీలైనంత ఎక్కువగా ఆహారం, ఆహార పదార్థాలు, ధాన్యాలను దానం చేయాలట. దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెబుతున్నారు. భక్తితో ఆహారాన్ని పేదలకు దానం చేయడ వల్ల పుణ్యం లభిస్తుందని చెబుతున్నారు. ‎కార్తీక మాసంలో 7 రకాల ధాన్యాలను దానం చేయడం ద్వారా, ఒక వ్యక్తి ఏడు జన్మల పాటు ఆనందం, శ్రేయస్సును పొందవచ్చట. అతను తన 7 జన్మలలో అపారమైన సంపద ఆనందాన్ని పొందుతారని, ఏవైనా ఏడు రకాల ధాన్యాలను మీరు ఎంచుకోవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా కార్తీక మాసం వివాహిత మహిళలకు కూడా చాలా పవిత్రమైన నెల. కార్తీక మాసంలో, వివాహిత స్త్రీలు గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, జాకెట్లు, చీరలు, పువ్వులు, గాజులు మొదలైన వాటిని దానం చేయాలి. వీటిని దానం చేయడం ద్వారా, భర్త ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం.

  Last Updated: 31 Oct 2025, 08:15 AM IST