Vastu Shastra : సంపద దేవుడు కుబేరుడు మీ నట్టింట్లో తిష్ట వేయాలంటే, ఈ వాస్తు టిప్స్ పాటించాలి..!!

కుబేరుడు సంపద, శ్రేయస్సుకు సూచిక. హిందూపురాణాల్లో కుబేరుడు...కీర్తిని, డబ్బును సూచిస్తాడు.

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 07:00 AM IST

కుబేరుడు సంపద, శ్రేయస్సుకు సూచిక. హిందూపురాణాల్లో కుబేరుడు…కీర్తిని, డబ్బును సూచిస్తాడు. కుబేరుడి అనుగ్రహం మనపై ఉండాలంటే…ఆయన్ను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉంచాలి. ఇలా చేసినట్లయితే ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కుబేరుడి అనుగ్రహం మనపై ఉండటంతో..ఇంట్లో సంతోషం, సంపద, శ్రేయస్సు కలిగి ఉంటాం. ఇవేకాదు కుబేరుడి అనుగ్రహం కోసం వాస్తు ప్రకారం ఇంట్లో ఇలా చేయండి. అప్పుడు ఆయన అనుగ్రహం తప్పకుండా మీపై ఉంటుంది. మీ ఇళ్లు లక్ష్మీతో కళకళలాడుతుంది. కుబేరుడి అనుగ్రహం ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

లాకర్ స్థానం : ఇంట్లో ప్రధానంగా విలువైన వస్తువలన్నీ కూడా లాకర్ లో ఉంచుతాం. కాబట్టి లాకర్ ఎఫ్పుడూ కూడా ఉత్తరం లేదా ఈశాన్య దిశలోనే ఉంచాలి.

ఇంట్లో దుమ్ము ధూళి ఉండకూడదు: వాస్తు పరకారం ఇళ్లు పరిశ్రుభ్రంగా ఉండాలి. ఇలా ఉంటే ఆ కుబేరుడు లక్ష్మీదేవి నివాసం ఉంటారు. అలంకరణ వస్తువులు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి.

నీటి ఫౌంటైన్లు, చిన్న అక్వేరియంలు: ఇంటికి సానుకూల శక్తిని, డబ్బును తీసుకురావాలంటే ఈ వస్తువులు ఎప్పుడూ కూడా ఇంటికి ఈశాన్య ప్రాంతంలో ఉండాలి. ట్యాంక్ లేదా అక్వేరియంలోనీరు స్తబ్దుగా లేదా మురికిగా ఉండకూడదు. ఇలా ఉంటే మీ ఆర్థిక వ్రుద్ధికి ఆటంకం కలిగిస్తుంది.

నీటి ట్యాంకుల స్థానం: మీ ఇంట్లో సంపు లేదా నీటి ట్యాంకులను ఇంటికి ఈశాన్య లేదా ఆగ్నేయ మూలలో ఉంచాలి. ఎందుకంటే పెద్ద నీటి ట్యాంకులను ఇష్టం వచ్చినట్లుగా ఉంచినట్లయితే అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మానసికంగా ఆరోగ్యం దెబ్బతినడంతో…సమస్యలకు కారణం అవుతుంది.

నీటి లీకేజీ ఉండకూడదు: ఇంట్లో నీటి లీకేజీలు ఉండకూడదు. అలా ఉంటే అది నేరుగా ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో నీటి లీకేజీ లేకుండా చూసుకోండి.

బాత్రూమ్ స్థానం: బాత్రూమ్, స్నానపు గది రెండూ కూడా విడివిడిగా నిర్మించుకోవాలి. ఇవి ఇంటికి వాయువ్య లేదా ఈశాన్య భాగంలో నిర్మించాలి. ఎందుకంటే టాయిలెట్స్ లేదా బాత్ రూంలు వాస్తు ప్రకారం నిర్మించకపోతే…ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొవల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.

ఉత్తర దిశలో రంగు: వాస్తు ప్రకారం ఉత్తర మండలానికి నీలం రంగు వేయాలి. ఈ ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఈ దిశలో చెత్త డబ్బా, మిక్సర్ గ్రైండర్, వాషింగ్ మిషిన్ వంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి.

బుద్ధుని విగ్రహం: ఇంట్లోబుద్దుని విగ్రహం ఉన్నట్లయితే ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు ఇంటి అలంకరణకు కూడా ప్రత్యేక రూపాన్నిస్తుంది. సానుకూల శక్తిని ఇస్తుంది.

మనీ ఫ్లాంట్: సాధారణంగా ప్రతి ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుంది. ఈ మొక్క ఆరోగ్యం, సంపదకు సంబంధించి మంచి ఫలితాలను పొందేందుకు శుభప్రదంగా భావిస్తారు.

కుబేరుని అనుగ్రహం పొందాలంటే…
1. ఉత్తరం దిక్కు కుబేరుని శుభ దిక్కు కాబట్టి..లాకర్ ను దక్షిణం వైపు ఉంచండి.
2. సంపదను ఆకర్షించానికి మీు లాకర్ ముందు అద్దం ఉంచండి.
3. ఉచితంగా ఏ వస్తువునైనా సరే తీసుకోవడం మానేయండి.
4. విరిగిన పాత్రలను ఇంట్లో ఉంచకూడదు.
5. ప్రతి శుక్రవారం దక్షిణామూర్తి శంఖం ద్వారా విష్ణువుకు నీటిని సమర్పించండి. ఇది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు సహాయపడుతుంది.