Site icon HashtagU Telugu

Vastu Tips : నిమ్మకాయతో ఇలా చేస్తే అప్పుల బాధ తీరిపోయి, లక్ష్మీదేవి నట్టింట్లో తిష్ట వేయడం ఖాయం..

Lemon Benefits

Lemon Benefits

భారతీయ వంటకాలలో లభించే అనేక పదార్ధాలను జ్యోతిషశాస్త్ర (Vastu Tips) నివారణలలో కూడా ఉపయోగిస్తారు. ఈ నిమ్మకాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి. అంతేకాదు పూజలోనూ నిమ్మకాయలను ఉపయోగిస్తారు. అయితే జ్యోతిష్యం ప్రకారం ఈ నిమ్మకాయ మీ సంపదను పెంచుతుందని మీకు తెలుసా.

– జ్యోతిష్య శాస్త్రం  ప్రకారం, కుటుంబ పెద్దపై నరద్రుష్టి ఉన్నట్లయితే నిమ్మకాయను తల నుండి కాలి వరకు ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి, ఆ తర్వాత ఈ నిమ్మకాయను 4 ముక్కలుగా చేసి, ఎవరూ చూడని చోట విసిరేయాలి. నిమ్మకాయ ముక్కలను విసిరేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకండి.

– ఎంత ప్రయత్నించినా విజయం లభించకపోతే నిమ్మకాయ, 4 లవంగాలతో హనుమాన్ గుడికి వెళ్లండి. నిమ్మకాయలో లవంగాలు వేసి హనుమాన్ చాలీసా చదవండి. వ్యాపారం సరిగ్గా జరగకపోతే ఐదు నిమ్మకాయలు కోసి ఆదివారం మధ్యాహ్నం ఆఫీసులో పెట్టండి.

– ఒక పిడికెడు ఎండుమిర్చి, కొన్ని పసుపు ఆవాలు తీసుకోండి. నిమ్మకాయతో పాటు ఈ వస్తువులన్నీ మరుసటి రోజు ఉదయం సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

-ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు నిమ్మకాయలను తీసుకుని సగానికి కోసుకోవాలి. ఒక భాగాన్ని వెనుకకు, మరొక వైపు విసిరేయండి. ఇలా చేస్తే చేసే పనిలో విజయం సాధిస్తారు.

-జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నిమ్మకాయపై నాలుగు లవంగాలు ఉంచి, ఆదివారం నాడు ‘ఓం శ్రీ హనుమంతే నమః’ అని 108 సార్లు జపిస్తే మీకు పనిలో విజయం చేకూరుతుంది. పెరట్లో నిమ్మచెట్టు నాటడం వల్ల సంతోషం, ఐశ్వర్యం పెరుగుతుంది.

Exit mobile version