Astro : శుక్రవారం మందార పువ్వుతో ఇలా చేస్తే…మీరు ధనవంతులు అవుతారు..!!

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 09:01 PM IST

హిందూగ్రంధాల ప్రకారం..చెట్లు, మొక్కలు, పువ్వులు వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పూజ సమయంలో దేవతలను పువ్వులతో అలంకరిస్తే జీవితంలో సదా ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం. అలాంటి పువ్వుల్లో మందార పువ్వు కూడా ఒకటి. పూజ సమయంలో ఈ పువ్వును ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా అమ్మవారిని పూజించే సమయంలో ఈ మందార పువ్వును సమర్పించడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం ఉంటుందని నమ్ముతుంటారు.

వాస్తు ప్రకారం మందార పువ్వు చాలా పవిత్రమైంది. ప్రధానంగా శుక్రవారంనాడు మందార పువ్వుతో కొన్ని ఖచ్చితమైన నివారణలు ప్రయత్నిస్తే…మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు. అయితే మందారం పువ్వుతో శుక్రవారం ఎలాంటి చర్యలు చేయాలో తెలుసుకుందాం.

సూర్యభగవానుడికి నీటిని సమర్పించేటప్పుడు…
మీరు సూర్యుని క్రమం తప్పకుండా నీటిని సమర్పించినట్లయితే…మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. శుక్రవారం నాడు సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు ఎర్రమందార పువ్వుతో పాటు చిటికెడు కుంకుమను ఉంచినట్లయితే..మీ ఇంటి ఆర్థిక పరిస్ధితి బాగుంటుంది. ప్రతిశుక్రవారం సూర్యునికి నీరు సమర్పించేటప్పుడు..మందార పువ్వులను సమర్పిస్తే…మీ శత్రవులను హానీ ఉండదు. ఎప్పుడు మీరు విజయం సాధిస్తారు.

దుర్గాదేవికి ఎర్రమందారం నైవేద్యాన్ని…
దుర్గామాతాకు ఎర్రమందార పువ్వును అర్పిస్తే…అది మీ జీవితంలో అద్భుత ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం నాడు వినాయకుడు, దుర్గమాతకు 5 ఎరుపు మందార పువ్వులను సమర్పించండి. ఈ పువ్వులో ఒకటి మీఇంట్లో లాకర్ లో ఉంచండి. ఈ పరిహారంతో మీకు ఎప్పటికీ డబ్బు కొరత అనేది ఉండదు. ప్రతి శుక్రవారం లాకర్ లో మందార పువ్వును మార్చుతూ ఉండండి.

లక్ష్మీదేవికి మందార పువ్వును సమర్పించండి…
11 శుక్రవారాలు లక్ష్మీదేవికి ఎర్రమందార పువ్వును సమర్పిస్తే…వివాహబంధంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. దీంతోపాటు ఈ పరిహారంతో వీ వైవాహిక జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి 2 మందార పువ్వులను నైవేద్యంగా సమర్పించి…ఖీర్ నైవేద్యంగా పెట్టినట్లయితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వైభవ లక్ష్మీ పూజలో ఎర్రమందార పువ్వులను సమర్పించినట్లయితే…మీ కోరికలు నెరవేరుతాయి. సంపద పెరుగుతుంది. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బును తిరిగి పొందుతారు.

నివారణలు…
మందార పువ్వు సంపదను పెంచడమే కాకుండా గ్రహబాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మందార పువ్వుతో సూర్యభగవానుడిని పూజించినట్లయితే…మనస్సు ప్రశాంతంగా శక్తివంతంగా ఉంటుంది. మందారపువ్వులో దుర్గామాత నివసిస్తుంది. ఆకుపచ్చ భాగంలో బుధుడు, కేతువు నివసిస్తారు.