Month of Shivratri: ప్రత్యేక పూజలతో శివుడిని పూజిస్తే సంపూర్ణ శివుని అనుగ్రహం

ఈ రోజు ప్రత్యేక పూజలతో శివుడిని పూజిస్తే సంపూర్ణ శివుని అనుగ్రహం లభిస్తుందని పండితులు సెలవిచ్చారు. ఈరోజు శివునికి ప్రియమైన దీపం, ప్రియమైన అభిషేకం, ప్రియమైన పుష్పం, ప్రియమైన నైవేద్యం, ప్రియమైన మంత్రం జపించడం మంచిది.

Published By: HashtagU Telugu Desk
Month of Shivratri

Month of Shivratri

Month of Shivratri: ప్రత్యేక పూజలతో శివుడిని పూజిస్తే సంపూర్ణ శివుని అనుగ్రహం లభిస్తుందని పండితులు సెలవిచ్చారు. ఈరోజు శివునికి ప్రియమైన దీపం, ప్రియమైన అభిషేకం, ప్రియమైన పుష్పం, ప్రియమైన నైవేద్యం, ప్రియమైన మంత్రం జపించడం మంచిది. పరమశివుని సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే.. పంచామృతం లేదా దర్భ కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి. తర్వాత పొడి గుడ్డతో శివలింగాన్ని తుడిచి గంధపు పూసలు పూయాలి. స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండం ప్రకారం పరమేశ్వరుడిని జిల్లెడు పూలతో పూజించాలి. వీటిని అర్క పుష్పాలు అంటారు. ఈ పువ్వులు పరమశివునికి చాలా ప్రీతికరమైనవి. కొబ్బరి ముక్కలు, అరటిపండు ముక్కలు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం ఈరోజు శివుడికి సమర్పించి పూజించవచ్చు. లేదా నువ్వుల బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టాలి. నువ్వులు – బెల్లం ముద్ద శివునికి ఇష్టమైనది.

ఈరోజు పూజ చేసేటప్పుడు.. “ఓం నమో మృత్యుంజయ స్వాహా” అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. గుడికి వెళ్లి చండీ ప్రదక్షిణలు కూడా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల 30 వేల సార్లు శివాలయాన్ని దర్శించుకున్న భాగ్యం కలుగుతుందని పండితులు తెలిపారు. బ్రాహ్మణులకు ఈరోజు విభూతి ఫలాలు ఇవ్వాలి. శివరాత్రి మాసంలో ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో పాటు పరిపూర్ణమైన జీవితం లభిస్తుందని, మోక్షప్రాప్తి కలుగుతుందని పండితులు తెలిపారు.

Also Read: Telangana : సీఎం రేవంత్ కీలక నిర్ణయం..54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు

  Last Updated: 11 Dec 2023, 06:58 AM IST