Salt : ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చేస్తే చాలు.. దరిద్రం పోయి అదృష్టం పట్టడం ఖాయం?

ఉప్పును (Salt) తీసుకుని ఇంటి లోపల ఉన్న అన్ని గదుల్లో ఒక గాజుపాత్రలో లేదంటే ఒక చిన్న పాత్రలో పెట్టి మూలలో పెట్టడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం ఉప్పు లాగేసుకుంటుంది.

  • Written By:
  • Publish Date - December 16, 2023 / 01:35 PM IST

Salt for Good Luck and Poverty : మామూలుగా ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల నెగటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. వాటి వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కొట్లాటలు మానసిక ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అటువంటప్పుడు కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని బయటికి తరిమేయచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

ఎప్పుడు ఇంటి లోపలికి వెలుతురు పడేలా జాగ్రత్త పడాలి. అందుకుగాను కిటికీలు చక్కగా తెరిచి ఉంచాలి. అలాగే ఉప్పును (Salt) తీసుకుని ఇంటి లోపల ఉన్న అన్ని గదుల్లో ఒక గాజుపాత్రలో లేదంటే ఒక చిన్న పాత్రలో పెట్టి మూలలో పెట్టడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం ఉప్పు లాగేసుకుంటుంది. ఆ తర్వాత 48 గంటల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత ఆ ఉప్పును (Salt) తుడిచేయాలి. అలా చేస్తే కనుక ఇంటి లోపలి నుంచి నెగెటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. అలా మీ ఇంటి లోపలికి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. చాలా మంది ఇంటి లోపలికి గాలి రాకుండా ఉండేందుకుగాను కిటికీలు, తలుపులు మూసేసి ఉంచుతారు. కానీ, అలా చేయడం వలన మీ ఇంటిలోనికి ఫ్రెష్ ఎయిర్ రాదు. కిటికీలను ఎప్పుడూ తెరిచి ఉంచడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటి లోనికి ప్రవహిస్తుంటుంది.

మీ ఇంటి నుంచి నెగెటివ్ ఎనర్జీ కంప్లీట్ గా పోయి పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉండిపోతుంది. ఇకపోతే ఇంటి లోపల విరిగిపోయిన వస్తువులు అసలు ఉండకూడదు. అలా విరిగిపోయిన వస్తువులు ఉంచడం వలన మీ ఇంటి లో నెగెటివ్ ఎనర్జీ ఉండిపోతుంది. నెగెటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే ఎప్పటికప్పుడు విరిగిన వస్తువులను బయట పడేయాలి. ఇంటి లోపల మంచి సువాసన వచ్చేటువంటి అగరబత్తిని వెలిగించి ఉంచాలి. అలా చేస్తే కనుక ఇంటి లోనికి పాజిటివ్ ఎనర్జీ చక్కగా వస్తుంది. సాంబ్రాణి వేయడం కూడా చేస్తుండాలి. తద్వారా మీ ఇంటి లోనికి సానుకూల శక్తి మాత్రమే వస్తుంది. ఈ చిట్కాను ఫాలో అవడం వలన చక్కటి ఉపయోగాలుంటాయి.

Also Read:  Oil Tips : వామ్మో.. ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్ళీ ఉపయోగిస్తే అంత డేంజరా?