Hing Astro: ఇంగువతో ఈ పరిహారాలు చేస్తే… ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు..!!

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 08:00 AM IST

భారతీయ ఇళ్లలోని వంటగదిలో ఇంగువ తప్పనిసరిగా ఉంటుంది. ఎన్నో వంటకాల్లో ఇంగువను జోడిస్తారు. ఇంగువ సువాసన వంటకాలకు మరింత రుచిని అందిస్తుంది. అయితే ఇంగువను పాకశాస్త్రంలో సుగంధ ద్రవ్యాల రాజుగా పరిగణిస్తారు. జ్యోతిష్యశాస్త్రంలో ఇంగువను సమస్యల నివారిగా పిలుస్తారు. ఇంగువతో కొన్ని రెమెడీస్ ప్రయత్నించినట్లయితే..జీవితంలో కష్టాలను దూరంగా చేసుకోవచ్చు. కాబట్టి ఇంగువతో కలిగే ప్రత్యేకమైన నివారణల గురించి తెలుసుకుందాం.

1. మీకు ప్రతి విషయంలో ఆటంకాలు ఎదురైనట్లయితే…రోజూ ఇంగువను తీసి ఉత్తరంవైపు వేయండి. ఇలా చేస్తే మీరు చేసే ప్రతిపనిలో విజయం సాధిస్తారు.
2. కర్పూరాన్ని ఇంగువతో గ్రైండ్ చేసి ఇంట్లో తయారు చేసిన కాజల్లో కలపండి. ఆ కాజల్ ను ఒక ఆకుపై ఉంచి హనుమాన్ కు సమర్పించండి. ఈ పరిహారం కళ్లను ప్రభావితం చేయదు.
3. చేతిలో ఇంగువను ఉంచుకుని ‘ఓం శ్రీ హనుమతే నమః’ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ రెమెడీతో ఎలాంటి భయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు.
4. ఇంగువ నీళ్లతో కడిగి ఆ నీటిని ఇంటి బయట పారే నదిలో కానీ కాలువలో కానీ వేయండి. ఈ పరిహారం ప్రతికూల శక్తి ప్రభావాన్ని తగ్గిస్తుంది .
5. ఇంగువ నీటితో స్నానం చేసి…11 వారాల పాటు మీ జేబులో తెల్లటి గుడ్డలో ఇంగువ కట్టి ఉంచుకోండి. ఈ పరిహారంతో రుణవిముక్తికి మార్గం తెరుస్తుంది.
6. ఇంగువతో కర్పూరం, ఎండుమిర్చి పొడిని తయారు చేసి, ఆ పొడిని సుగంధ ద్రవ్యాలపై వేసి కాల్చండి. ఈ పరిహారంతో మీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది.
7. నల్లటి గుడ్డలో ఇంగువను కట్టి, రావి చెట్టు వేరు క్రింద పెట్టండి. ఈ పరిహారంతో మీ శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించరు.
8. ఎర్రటి గుడ్డలో ఇంగువను కట్టి, 11 శనివారాలు లాఖర్ లో ఉంచండి. ఇలా చేయడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి.
9. 11 ఆదివారాలు ప్రవహించే నీటిలో రోజు ఇంగువను వేయండి. తర్వాత హనుమంతుడిని ధ్యానం చేయండి. ఈ పరిహారంతో మీకు జీవితంలోఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి.