Lucky: ప్రతిరోజు ఈ ఐదు పనులు చేస్తే చాలు.. అదృష్టం మీ వెంటే?

ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని, ఆనందాలతో

  • Written By:
  • Updated On - December 29, 2022 / 10:01 AM IST

ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని, ఆనందాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం కొంతమంది నిరంతరం కష్టపడుతున్నప్పటికీ అనుకున్న విధంగా ఫలితాలు కనిపించడం లేదు అని దిగులు చెందుతూ ఉంటారు. సాధారణంగా జీవితంలో విజయం సాధించాలి అంటే శ్రమ అదృష్టం తప్పనిసరి అని చెబుతూ ఉంటారు. మరి అదృష్టాన్ని పెంచుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో, అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అదృష్టం పొందాలంటే ఐదు రకాల పనులు తప్పనిసరిగా చేయాల్సిందే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతిరోజు నిద్ర లేవగానే పళ్ళు తోముకొని ముఖం కడకాలి. తర్వాతనే ఏదైనా తినాలి. అదేవిధంగా స్నానం చేయకుండా ఇంట్లోనే పూజగదికి వెళ్లడం పూజ వస్తువులను తాకపోవడం లాంటివి చేయకూడదు. అలాగే భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా దిశను పాటించాలి. భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశగా కూర్చుని తినాలి. అలాగే చెప్పులు బూట్లు లాంటివి వేసుకొని తినకూడదు. భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దని ఈశ్వరుని కోసం పక్కన పెట్టాలి. అదేవిధంగా ఇంట్లో ప్రతిరోజు గంగాజలాన్ని చల్లుకోవడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది.

ప్రతిరోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో గంగాజలను చల్లడం మంచిది. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి. దీపారాధన కోసం నెయ్యిని ఉపయోగించి దీపం వెలిగించడం వల్ల అదృష్టం వరించడంతోపాటు ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది. అలాగే పూజ సమయంలో చాలామంది దేవుడికి పెట్టే పూలు నీటితో కడగకుండా అలాగే పెడుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. దేవుడికి పెట్టే పూలను నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత దేవుడికి పెట్టాలి. ఈ ఐదు పనులు చేయడం వల్ల అదృష్టం వరించడంతోపాటుగా, ఆనందం శ్రేయస్సు లభిస్తుంది.