Site icon HashtagU Telugu

Kamada Ekadashi Vratam: ఈ 5 తప్పులు చేస్తే.. కామద ఏకాదశి వ్రత భంగం..

If You Do These 5 Mistakes..kamada Ekadashi Vrata Bhangam

If You Do These 5 Mistakes..kamada Ekadashi Vrata Bhangam

Kamada Ekadashi Vratam : హిందూ సంప్రదాయం ప్రకారం.. మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి. అందులో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇక తెలుగు వారికి నూతన సంవత్సరంలోని చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేకత ఉంది. దీనినే కామద ఏకాదశి లేదా దమన ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కామద ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఏకాదశి వ్రతం (Kamada Ekadashi Vratam) పుణ్యఫలితాలను పొందాలంటే పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కామద ఏకాదశి రోజున శ్రీమహా విష్ణువును పూజలు చేస్తే ఉపవాసం ఉన్న భక్తుల కోరికలు నెర వేరుతాయి. కానీ కొన్నిసార్లు తెలిసీ లేదా తెలియక కొన్ని తప్పులు చేయడం వల్ల ఏకాదశి వ్రత భంగం జరుగుతుంది. అందుకే ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వ్యక్తులు ఎల్లప్పుడూ కొన్ని ప్రత్యేక నియమాలను గుర్తుంచుకోవాలి.

  1. ఏకాదశి రోజున తెల్లవారు జామున నిద్ర లేవాలి. కుటుంబ సభ్యులెవరైనా ఏకాదశి వ్రతం పాటించకపోయినా తెల్లవారుజామున నిద్రలేవాలి.
  2. ఉపవాసం రోజున నల్లని బట్టలు ధరించరాదని గుర్తుంచుకోండి.  పసుపు రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించాలి.
  3. ఈ రోజున పసుపు బట్టలు ధరించడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు.
  4. తులసి లేదా పసుపు చందనం మాలలతో  ఏకాదశి ఆరాధన చేస్తూ విష్ణువు మంత్రాలను పఠించడం మంచిది.
  5. ఏకాదశి రోజున కుటుంబ సభ్యులు ఎవరైనా ఉపవాసం ఉన్నట్లయితే.. పొరపాటున కూడా ఇంట్లో అన్నం తయారు చేయకూడదు.
  6. ఈ ఏకాదశి రోజున వెల్లుల్లి, ఉల్లిపాయలు, మాంసం, మద్యం వంటివి తీసుకోకూడదు.
  7. ఏకాదశి రోజున దానధర్మాలు చేయాలి. ఎవరికైనా అవసరాన్ని బట్టి వస్తువులు దానం చేయడం వల్ల ఆ వ్యక్తి జీవితంలోని దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి.  అటువంటి పరిస్థితిలో, ఈ రోజు ఎవరైనా ఏదైనా అడగడానికి మీ వద్దకు వస్తే, మీరు పొరపాటున కూడా ఎవరినీ అవమానిం చకూడదు.
  8. హిందూ విశ్వాసం ప్రకారం.. దానధర్మాలు ఎల్లప్పుడూ ఒకరి సామర్థ్యాన్ని బట్టి చేయాలి.
  9. ఏకాదశి రోజున ఎవరైనా ఇచ్చిన ఆహారం తినకూడదు. ఇది కాకుండా, ఎవరైనా మిమ్మల్ని విందు కోసం ఆహ్వానిస్తే వెళ్లకూడదు. కొన్ని కారణాల వల్ల మీరు విందుకు వెళ్లి భోజనం చేస్తే.. దాన్ని అప్పుగా భావించి , బదులుగా వారికి వేరే ఏదైనా ఇచ్చేయండి.
  10. ఏకాదశి రోజున మీ భాగస్వామితో శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పూర్తిగా పాటించాలి.

Also Read:  Kazipet: శ్రీ శ్వేతార్కమూల గణపతి ఆలయం.. వరంగల్ జిల్లా: కాజీపేట