Sunset : సూర్యాస్తమయం తరువాత ఇలాంటి పనులు చేస్తే కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నట్టే?

అలా సూర్యాస్తమయం (Sunset) సమయంలో తెలియక చేసే తప్పుల వల్ల జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 06:00 PM IST

Avoid doing these things after Sunset : హిందూ ధర్మం ప్రకారం సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో కొన్ని రకాల పనులు చేయడం అస్సలు మంచిది కాదని పండితులు చెబుతూ ఉంటారు. మనం తెలిసి తెలియక చేసే ఆ తప్పుల వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా సూర్యాస్తమయం (Sunset) సమయంలో తెలియక చేసే తప్పుల వల్ల జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి సూర్యాస్తమయం (Sunset) సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

హిందూ ధ‌ర్మం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత దుస్తులు ఉతకడం, ఆరబెట్టడం అసలు మంచిది కాదు. సూర్యాస్తమయం తర్వాత దుస్తులు ఆరుబయట ఆరబెట్టడం వల్ల ప్రతికూల శక్తి వాటిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా వ్యక్తి దుఃఖాన్ని, దురదృష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.. అలాగే సూర్యాస్తమయం సమయంలో అసలు నిద్రించకూడదు. జబ్బు పడినవారు, పిల్లలు తప్ప, మిగిలిన వారికి ఈ నియమం వ‌ర్తిస్తుంది. అలా సూర్యాస్తమయం సమయంలో నిద్ర పోవడం వల్ల వ్యాధి, దుఃఖం, పేదరికం వారిని ముంచెత్తుతాయి. దీని వల్ల మనిషి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు సూర్యాస్తమయం సమయంలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు లేదా పిల్లల కోసం ఏదైనా తీసుకోండి. సూర్యాస్తమయం సమయంలో లేదా సూర్యా స్తమయం తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి రావడం గొప్ప దోషంగా భావించాలి.

హిందూ ధ‌ర్మం ప్రకారం, సంపదను కోరుకునే వారు సూర్యాస్తమయం తర్వాత తమ గోర్లు, జుట్టును కత్తిరించకూడదు. ఈ నియమాన్ని విస్మరించిన వారు ఆర్థికంగా న‌ష్టాల పాల‌వుతార‌ని, రుణ‌భారం ఎదుర్కొంటారు. సూర్యాస్తమయం సమయంలో ఈ పని చేయడం వ‌ల్ల ధ‌న న‌ష్టం మాత్రమే కాదు. హిందువులు అనేక రకాల చెట్లు, మొక్కలను దేవుని రూపాలుగా పూజిస్తారు. సూర్యాస్తమయం తర్వాత చెట్ల ఆకులు, కొమ్మలు మొదలైన వాటిని విరగగొట్టడం లేదా వాటిని మంటల్లో కాల్చడం మహా పాపంగా పరిగణిస్తారు. ఈ సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటాయి. కాబట్టి వారిని బాధపెట్టడం సరికాదు. హిందూ విశ్వాసం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత మరణించిన ఏ వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించ‌రు. గరుడ పురాణం ప్రకారం, ఈ నియమాన్ని విస్మరిస్తే, చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతించదు.

తరువాతి జన్మలో చాలా బాధ అనుభవిస్తుంది. ఈ దోషం వల్ల పితృ దోషం కూడా రావచ్చు. ఎవరైనా సూర్యాస్తమయం సమయంలో మరణిస్తే మరుసటి రోజు దహనం చేయడం ఉత్తమం. సూర్యాస్తమయం సమయంలో, ఆ తరువాత ఇల్లు ఊడ్చకూడదు. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. అలాంటి ఇళ్లలో ధ‌న‌ధాన్యాల‌కు కొరత ఏర్పడుతుంది. ఇలా పైన చెప్పిన విషయాలను సూర్యాస్తమయం తర్వాత చేస్తే కష్టాల సుడిగుండంలో పడ్డట్టే అవుతుంది. అంతేకాకుండా లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.

Also Read:  WhatsApp Alert : వాళ్లకు వాట్సాప్‌ ‘స్క్రీన్ షేర్’ చేశారో అంతే సంగతులు!