Site icon HashtagU Telugu

Kartika masam: కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేస్తే!

Satyanarayana

Satyanarayana

కార్తీక మాసం…ఎంతో శ్రేష్ట‌మైన మాసం. ఈ మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు ఒక వత్తిని ఉపయోగించడం కూడదని.. కార్తీక దీపంలో రెండు వత్తులు కలిపి రెండు రెండుగా వేయడం లేదా మూడు వత్తులు కలిపి వేయాలని పండితులు చెప్తున్నారు. ఆ వత్తులు, తామర నార, అరటినార వంటివి ఉపయోగించాలి. అలాగే కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణస్వామి వ్రతం చేయడం వలన ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

ఈ మాసంలో అభిషేకాలు, బిల్వ అర్చన, స్తోత్ర ప్రయాణాలు,శివ నామ స్మరణలు ఎంతో మేలు చేస్తాయి

కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో లేదా ఏదైనా శుభ దినాన సాయంకాలం కానీ, ఉదయం కానీ శుచిగా స్నానమాచరించి.. బ్రాహ్మణులను, బంధుమిత్రాదులను రప్పించి, దేవాలయంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, సముద్రతీరాన కానీ, నదీతీరాన కానీ, స్వగ్రహమునకానీ, పుణ్యక్షేత్రములందు సత్యనారాయణ వ్రతం చేయించాలి. పూజా స్థలాన్ని గోమయముచే శుద్ధిచేయాలి.

తూర్పుగా బియ్యం, చూర్ణము, పసుపు, కుంకుమలతో ముగ్గులు పెట్టి, మంటపము గావించి, మామిడాకుల తోరణములతో సుందరముగా అలంకరించి పూజాద్రవ్యములు రాగిపాత్ర నూతన వస్త్రాలు, కొబ్బరికాయ, పూజా స్థలo నందు ఉంచాలి. భక్తితో దీపారాధన చేసి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కష్టనష్టాలు తొలగిపోతాయి. ధనధాన్యాలకు లోటుండదు. సౌభాగ్యకరమైన సంతానం, సర్వత్రా విజయం లభిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తీక మాసముంలందు కానీ, ఏదైనా శుభదినాన దీనిని ఆచరించాలి. దారిద్ర్యం తొలగిపోవాలంటే.. ఈ వ్రతాన్ని ఆచరించాలి.