Site icon HashtagU Telugu

Vastu : ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే..కష్టాలు తప్పవట…!!

Vastu Shastra 2 512x320 1

Vastu Shastra 2 512x320 1

ఇంట్లో సుఖసంతోషాలు, ధనం ఉండాలంటే ఆ ఇంటికి వాస్తు సరిగ్గా ఉండాలి. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగెటివ్ ఎనర్జీ పారిపోతుంది. అందుకేచాలామంది వాస్తు చాలా ప్రాధాన్యత ఇస్తూ..వాస్తును ఫాలో అవుతుంటారు. ఇల్లు కట్టే ముందు వాస్తు తప్పనిసరిగా చూపిస్తారు. అయితే వాస్తు ప్రకారం వీటికి ప్రాధాన్యత ఇస్తే ఎలాంటి సమస్యలు అయినా సరే తొలగిపోతాయి. వాస్తున అనుసరించినట్లయితే ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. ఎలాంటి గొడవలు జరగవు. అయితే ఇంట్లో పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు చిట్కాలేంటో తెలుసుకుందాం.

– వాస్తు ప్రకారం ఇంట్లో గోడలకు ఆకుపచ్చ రంగు వేయడం మంచిదికాదు. ఎందుకంటే ఆకుపచ్చ రంగు పిశాచులకు ఇష్టమట. కాబటి ఆకుపచ్చరంగును గోడలకు వేయడం అరిష్టంగా భావిస్తారు. గోడలు గ్రీన్ కలర్ లో తడిగా ఉంటే విషవాయువులను విడుదల చేస్తుంది కాబట్టి గ్రీన్ కలర్ ఇంట్లో వేయించుకోకండి.

– ఇక ఇళ్లల్లో పగిలిపోయిన అద్దాలు, విరిగిపోయిన గోడగడియారాలు ఉండకూడదు. అంతేకాదు ఇంట్లో పాత సామాన్లు, పనికిరాని సామాన్లను ఉంచకూడదు. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. ఏవైనా పనికిరాని సామాన్లను ఇంటి బయటమాత్రమే ఉంటాచి. ఇంట్లో ఉంచితే నెగెటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.

– ఇక ఇంట్లో గొడుగుని తెరిచి పెట్టకూడదు. ఇంట్లో గొడుగు తెరిచి ఉన్నట్లయితే ఆత్మలకు అనుకూలమట. ఎండిపోయిన మొక్కలు కూడా ఇంట్లో ఉండకూడదు. ఈ విధంగా ఫాలో అయితే ఎలాంటి సమస్యలు రాకుండా ఉండొచ్చు.

Exit mobile version