Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ ఐదు వస్తువులను ఇంటికి తెస్తే చాలు.. కాసుల వర్షమే?

అక్షయ తృతీయ వచ్చింది అంటే చాలు మహిళలకు పండగే పండగ అని చెప్పవచ్చు. అక్షయ తృతీయ రోజున పెద్ద

Published By: HashtagU Telugu Desk
Akshaya Tritiya

Akshaya Tritiya

అక్షయ తృతీయ వచ్చింది అంటే చాలు మహిళలకు పండగే పండగ అని చెప్పవచ్చు. అక్షయ తృతీయ రోజున పెద్ద సంఖ్యలో మహిళలు బంగారు షాపులకు వెళ్లి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున ఐశ్వర్యానికి అతిదేవత ఆయన లక్ష్మీదేవిని విష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలా పూజించడం వలన సుఖసంతోషాలతో పాటు అదృష్టం వస్తుందని నమ్ముతూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున ఐదు రకాల వస్తువులను ఇంటికి తీసుకుని రావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి తప్పకుండా ధనవంతులవుతారు అంటున్నారు పండితులు. మరి ఆ ఐదు రకాల వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శ్రీ యంత్రం.. ఈ శ్రీ యంత్రాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. నియమ నిబంధనలతో భక్తిశ్రద్ధలతో శ్రీ యంత్రాన్ని పూజించే ఆ ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిల్వ ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో శ్రీ యంత్రం లేకపోతే అక్షయ తృతీయ రోజున శ్రీ యంత్రం ఇంటికి తెచ్చుకోవడం వల్ల శుభకరమైన ఫలితాలు పొందవచ్చు. అలాగే పసుపు గవ్వలు.. లక్ష్మీదేవి పూజలు వీటిని పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గవ్వలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. బార్లీ.. అక్షయ తృతీయ రోజున బార్లీ ని కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

అక్షయ తృతీయ రోజుతో పాటు ఏడాది పొడవునా బార్లీ నైవేద్యంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. తులసి.. తృతీయ రోజున తులసి మొక్కను తెచ్చుకుని ఉంటే నాటుకోవడం వల్ల అదృష్టం ఆనందం ఇంట్లో కొలువు తీరుతుంది. మీకు స్థలం ఉంటే జమ్మి చెట్టును కూడా నాటుకోవచ్చు. అలాగే శంఖం.. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా పరిగణిస్తారు. సముద్ర మతనం సమయంలో కూడా ఆవిర్భవించింది. అటువంటి పరిస్థితుల్లో సంపదను కోరుకునే వ్యక్తి అక్షయ తృతీయ రోజున ఇంటికి శంఖాన్ని తెచ్చుకొని శంఖంని ఊదడం వల్ల ప్రతికూల శక్తులు వెళ్లిపోయి లక్ష్మీదేవి నివసిస్తుంది.

  Last Updated: 19 Apr 2023, 06:53 PM IST