Site icon HashtagU Telugu

Vastu Tips : పొరపాటున కూడా ఇంట్లో ఈ మొక్కలు పెంచకండి…దరిద్రం మన నెత్తిమీద పెట్టుకున్నట్లే..!!

Plants

Plants

వాస్తుశాస్త్రం ప్రకారం కొన్నింటిని తప్పకుండా నమ్మాలి…పాటించాలి. ముఖ్యంగా ఇంటి విషయంలో ప్రతిదీ వాస్తుప్రకారం ఉంటేనే సుఖశాంతులు ఉంటాయని పండితులు అంటున్నారు. సరైన దిశలో…సరైన సమయంలో నాటిన కొన్ని చెట్లు మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన, సానుకూల మార్పులను తెస్తాయి. అదే సమయంలో మీకు కీడు కలిగించే చెట్లు కూడా ఉంటాయి. వాటిని వెంటనే తొలగించాలి. లేదంటే కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులకు గురవుతారు.

1. ఇంటి పరిసరాల్లో తుమ్మ చెట్లు ఉండకూడదు. ఈ చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే నెగెటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంటి వాతావరణం కూడా గందరగోళంగా మారుతుంది.

2. ఇంటి చుట్టుపక్కల కాక్టస్ మొక్కలను నాటకూడదు. ఇంట్లో ఆ మొక్కలు ఉంటే ఉద్రిక్త వాతవరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. చాలామంది అలంకరణ కోసం ఈ మొక్కలు నాటుతారు. కానీ అస్సలు ఈ మొక్కలను నాటకండి ఇంట్లో బాధలు, చికాకులు పెరుగుతాయి.

3. రేగు చెట్టున్న ఇంట్లో కష్టాలు పెరుగుతాయి. రేగు చెట్టులోని ముళ్ల కారణంగా ఇంట్లోప్రతికూలత పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతుంది. ఇంట్లో లక్ష్మీ దేవత నివసించదని వాస్తు పండితులు చెబుతున్నారు.

4. నిమ్మ, ఉసిరి చెట్లు లేకుండా చూడాలి. ఇలాంటి చెట్లు ఉంటే ఇంట్లో కష్టాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. అశుభాలు కలుగుతాయని చాలామంది అంటుంటారు. ముళ్ళున్న పూలు, పండ్ల చెట్లు ఇంట్లో ఉంటే ఏది కలిసి రాదన్న విషయం గుర్తుంచుకోవాలి.