Site icon HashtagU Telugu

God: దేవుడికి మొక్కుకున్న మొక్కులు చెల్లించకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Prayers

Prayers

ఇంట్లో లేదా దేవాలయాల్లో దేవుళ్లకు పూజ చేసినప్పుడు మన మనసులోని కోరికలు దేవుళ్లకు చెప్పుకొని అవి నెరవేరితే మొక్కులు చెల్లించుకుంటాము అని రకరకాల మొక్కులను మొక్కుకుంటూ ఉంటారు. అయితే ఆ కోరికలు నెరవేరే సమయానికి చాలామంది దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులను మరిచిపోతూ ఉంటారు. అలా మొక్కుల‌ను మ‌రిచిపోతే ఒక్క‌క్క‌రూ ఒక్కో విధంగా అనుకుంటారు. ప్ర‌ధానంగా దేవుడికి ఇచ్చిన మాట‌నే నెర‌వేర్చ‌లేని వాడు మ‌నుషుల‌కు ఇచ్చిన మాట ఏం నెర‌వేరుస్తాడ‌ని కొంద‌రు అంటుంటే మ‌రికొంద‌రూ న‌మ్మ‌కంతో ఉంటారు.

మ‌నిషి దేవుడికి ఇచ్చిన మాట‌ను నెర‌వేర్చ‌క‌పోతే ఇక ఎవ్వ‌రికీ జ‌వాబుదారి కాలేడు. జ‌వాబు దారిత‌నం నేర్పించ‌డం కోస‌మే మొక్కిన మొక్కును తీర్చుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల క‌థ‌లు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా మొక్కు అన‌గా ఒక మాట ఇవ్వ‌డం. ఈ ఆప‌ద నుంచి న‌న్ను గ‌ట్టెక్కించు నేను నీకు ఇది చేస్తా, అది చేస్తా అని చెప్ప‌డం. సృష్టిలో ఉన్న ప్ర‌తి ఒక్క‌టి మ‌న‌కు దేవుడు ఇచ్చిందే. చాలా మంది ఇది నాది, అది నాది అంటుంటారు. కానీ ఏది ఎవ్వ‌రిదీ కాదు. అన్ని ప్ర‌తి ఒక్క‌టి దేవుడివే అని కొంద‌రూ చెబుతుంటారు. నీవు చేసిన దానం, నీ స‌త్ప్ర‌ర్త‌న‌, నువ్వు చేసిన పూజ‌, నీ శ్ర‌ద్ధ‌, నువ్వు చేసిన మంచి మాత్ర‌మే నీవి. మిగ‌తావి అన్నిఆ భ‌గ‌వంతుడివే. నీవు చేసిన అప్పు రేపు నీకు ముప్ప‌వుతుంది. నీవు బ్ర‌తికి ఉన్న‌ప్పుడే కాదు.

మ‌ర‌ణించినా కూడా మ‌రో జ‌న్మ‌లో నిన్ను అది వెంటాడుతూనే ఉంటుంది. సాధార‌ణంగా దేవుడికి త‌ల‌నీలాలు ఇస్తామ‌నో, పాయిసం పోస్తామ‌నో, దేవుని గుడికి సాయం చేస్తామ‌నో లేదా మ‌రేదైనా ర‌క‌ర‌కాల కోరిక‌లు కోరుతుంటాం. మ‌నం మొక్కే మొక్కుల‌న్ని భ‌గ‌వంతుడి వ‌స్తువులే. మ‌న‌లో శ‌క్తి ఉంటే ఆ శ‌క్తిని మ‌నం స‌మ‌ర్పిస్తుంటాం. సాధార‌ణంగా స‌త్య‌నారాయ‌న స్వామి వ్ర‌తం చేస్తాం. ర‌థం చేసిన‌ప్పుడు మ‌న‌కు ఉండాల్సింది శ్ర‌ద్ధ‌. భ‌గ‌వంతుడు ముఖ్యంగా నీ యొక్క శ్రద్ధ లోపాన్ని స‌హించ‌డు. స‌మ‌యానికి మొక్కుబ‌డి చెల్లించలేదంటే నీకు దేవుడి మీద శ్ర‌ద్ధ లేన‌ట్టే లెక్క‌. అలా అని దేవుడికి మొక్కుకున్న మొక్కులు మర్చిపోవడం ఏ మాత్రం మంచిది కాదు. దేవుడికి మొక్కుకున్న మొక్కులు మీరు మరిచిపోతారు అనుకుంటే ఏదైనా ఒక పేపర్ లో రాసుకొని భద్రంగా దాచుకోవడం మంచిది.