Vastu: నవరాత్రుల్లో తులసీ పూజ ఈవిధంగా చేస్తే…కష్టాల నుంచి గట్టెక్కుతారు..!!

హిందూ పురాణాల ప్రకారం దసరా నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజించే సంప్రదాయం ఉంది. అయితే తులసి చెట్టును కూడా లక్ష్మీదేవిగా భావిస్తారు.

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 06:00 AM IST

హిందూ పురాణాల ప్రకారం దసరా నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజించే సంప్రదాయం ఉంది. అయితే తులసి చెట్టును కూడా లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే నవరాత్రుల్లో తులసీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వివాహిత స్త్రీలు నవరాత్రుల్లో తులసిని పూజించారు. తులసీని మనస్సుపూర్తిగా పూజించినట్లయితే…కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో శ్రేయస్సు నెలకొంటుంది. తులసి మొక్క ఇంట్లో నాటితే కుటుంబంలో ఆర్దిక, ఆరోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి. అంతేకాదు నవరాత్రుల్లో తులసిమొక్కకు ప్రత్యేక పూజలు చేస్తే…భర్త ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

నవరాత్రుల్లో తులసీని ఎలా పూజించాలో తెలుసుకుందాం:

ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి 9 రూపాల్లో కొలువై ఉంటుంది. పార్వతి, మాతా లక్ష్మి, సరస్వతి దేవి నుండి అవతరించింది. కాబట్టి మీరు నవరాత్రులలో ఈ మూడు దేవతలను పూజించాలి. తులసి మొక్క లక్ష్మీ దేవి రూపం, కాబట్టి మీరు సంపద, ఆనందం, శ్రేయస్సుకు సంబంధించిన కోరికలు నెరవేరాలంటే తులసిదేవిని పూజించాలి.

నవరాత్రులలో తులసి మొక్కను పూజించటానికి నియమాలు:
తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోయాలి. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే, మీరు ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్న తులసి మొక్కకు నీరు పోయండి. మీరు తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు సూర్యడు మీ వైపు ఉండేలా నిల్చుండి నీరు పోయండి. సూర్య కిరణాలు, తులసి మొక్కశక్తి ఈ రెండు కూడా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. మీపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.

తులసి ఆకులను తినండి:
క్రమం తప్పకుండా తులసి మొక్క నుండి 5 నుండి 7 ఆకులను విరిచి, నీటితో శుభ్రం చేసిన వాటిని తినండి. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంది. అంతేకాదు మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు.

తులసికి పచ్చిపాలు సమర్పించండి:
నవరాత్రి పండుగలో ఏ గురువారం వచ్చినా, మీరు తులసి మొక్కకు నీటితో పాటు కొన్ని చుక్కల పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించండి.

నవరాత్రి మాసంలో తులసి పూజ నియమాలు:
తులసి మొక్క ముందు దీపం పెట్టండి:
సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకకూడదు. తులసి ముందు దీపం పెట్టవచ్చు.ఇది క్రమం తప్పకుండా చేయాలి.ప్రతిరోజూ దీపం పెట్టడం వీలుకాకున్నా…నవరాత్రుల్లో మాత్రం తులసీ ముందు ప్రతిరోజూ దీపం వెలిగించండి. అంతేకాదు 7 కర్పూర దీపాలను కూడా వెలిగించవచ్చు. ఇలా చేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ నాశం అవుతుంది.

తులసి మంత్రాలను జపించండి:
మీరు తులసి మొక్కకు నీటిని సమర్పించినప్పుడల్లా లేదా తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసినప్పుడల్లా, మీరు ఖచ్చితంగా ‘మహాప్రసాద్ జననీ సర్వ సౌభాగ్యవర్ధిని, ఆది వ్యాధి హర నిత్యం తులసీ త్వం నమోస్తుతే’ అని జపించాలి. ఈ మంత్రం మీ కోరికలన్నీ తీరుస్తుంది.

(మీకు ఈ స్టోరీ నచ్చితే..లైక్ చేయండి కామెంట్ చేయండి. ఇతర స్టోరీలు చదవడానికి హ్యాష్ ట్యాగ్ కు కనెక్ట్ అయి ఉండండి.)