Vastu : గురువారం ఈ పరిష్కారం చేస్తే డబ్బుకు, ధాన్యానికి లోటు ఉండదు..!!

  • Written By:
  • Publish Date - November 3, 2022 / 05:25 AM IST

కార్తీక మాసంలో గురువారానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ రోజున పంచక కాలం రోజంతా ఉంటుంది. పంచక కాలంటే శాస్త్ర ప్రకారం మంచిదికాదు. కాబట్టి ఈ సమయంలో కొన్ని పనులు చేయడం నిషేధం. కానీ గురువారం విష్ణువు, దేవతలకు అధిపతి అయిన గురువుతో సంబంధం కలిగి ఉంటుంది. జీవిత సమస్యలను అధిగమించడంతోపాటుగా ఆధ్యాత్మిక పురోగతి, సంపద, శ్రేయస్సు ప్రతిష్టను పెంచేందుకు గురువారం ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పంచక కాలంలో కొన్ని పనులు చేయడం వల్ల అనేక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

1. శాస్త్రం ప్రకారం, గురువారం, పంచక సందర్భంగా, సాయంత్రం ఐదు దీపాలను వెలిగించి, శివుడు, దుర్గాదేవి, విష్ణువు, తులసి, హనుమంతుని ముందు ఒక్కొక్కటిగా ఉంచండి. ఇలా చేయడం ద్వారా, పంచక అశుభ ప్రభావం తొలగిపోతుంది. జీవితంలో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. దీంతో మీ పనులన్నీ క్రమంగా పూర్తవవుతాయి.

2.గురువారాల్లో అరటి మొక్కకు పూజ చేసి అనంతరం విష్ణుమూర్తిని పూజించాలి. పూజ తర్వాత ఆవుకు శనగపప్పు, బెల్లం, పిండి తినిపించాలి. ఇలా చేయడం ద్వారా శ్రీమహావిష్ణువు. గురువు బృహస్పతి ఆశీస్సులు లభిస్తాయి. తద్వారా జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.

3.కార్తీక మాసంలో గురువారం నాడు కుంకుమతో కూడిన ఖీర్ తయారు చేయాలి. ఐదుగురు పెళ్లికాని అమ్మాయిలను అంటే కన్యలను ఇంటికి పిలిచి వారికి ఖీర్ అందించండి. ఆపై దక్షిణం అందించడం ద్వారా పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోండి. ఆ తర్వాత కుటుంబమంతా ప్రసాదం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుంటుంది. ఇంట్లో డబ్బు, ఆహారానికి ఎలాంటి లోటూ ఉండదు.

4.పసుపు రంగు వస్తువులను గురువారం వాడాలి. స్నానం చేసిన తర్వాత పసుపు బట్టలు ధరించండి. పసుపు రంగు వస్తువులను మాత్రమే దానం చేయండి. కానీ పసుపు పండ్లు లేదా ఇతర ఆహార పదార్థాలను స్వయంగా తీసుకోకండి. ఈ రంగును ధరించి, విష్ణువుమూర్తిని పూజించి, విష్ణుసహస్రనామాన్ని జపించాలి. పూజానంతరం ఇంట్లోని పూజా స్థలంలో పసుపు మాల వేయండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో ఆటంకాలు ఉంటే తొలగిపోయి లాభాల వస్తాయి.

5.ఇంట్లో ఎవరైనా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటే, పెళ్లికి కావలసిన వస్తువులు సిద్ధం చేసుకోవాలంటే పంచకాల్లో ఈ పనులు చేయకూడదు. గురువారం గాయత్రీ హవనం చేసి ధ్యానం చేయండి. దీని తరువాత, మీరు వివాహానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయండి.

6.కార్తీక మాసంలో గురువారం నాడు దక్షిణం వైపు ప్రయాణించాలనుకుంటే.. ప్రయాణం ప్రారంభించే ముందు హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోండి. ఆ తర్వాత ప్రయాణం ప్రారంభించండి. ఆలయంలో హనుమాన్ చాలీసాను జపించి ఐదు పండ్లను సమర్పించండి. మీ పని గురించి దేవునికి చెప్పి, ఆపై ప్రయాణానికి బయలుదేరండి. ఇలా చేయడం వల్ల మీ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. అంతేకాదు పంచక దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి.