Vastu Plants : ఈ మొక్క విష్ణువు, నవగ్రహాలకు ఇష్టం..ఇంట్లో నాటితే ఆటంకాలన్నీ తొలగిపోయి ధన లాభం కలుగుతుంది..!!

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 10:23 AM IST

పువ్వులు లేని పూజ అసంపూర్ణం. పూజించాలంటే పువ్వులు ఉండాల్సిందే. ఒక్కోదేవుడికి ఒక్కోరకమైను పువ్వులతో పూజలు చేస్తారు. అయితే ముఖ్యంగా కొన్ని పూజ మొక్కలంటే విష్ణుమూర్తికి, నవగ్రహాలకు ఎంతో ఇష్టం. అందులో తులసి, అపరాజిత మొక్కలు ఉన్నాయి. అపరాజిత పువ్వులు అంటే మహాదేవునికి ఎంతో ఇష్టం. తులసిని పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీ నారయాణలను పూజించినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. అయితే అపరాజిత పుష్ఫానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అపరాజిత పుష్ఫాలు సాధారణం కాళి, శని పూజలో ఉపయోగిస్తారు. ఈ పువ్వు శనీశ్వరునికి , విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనవి.

ఈ పూలమొక్కను ఇంట్లో నాటితే ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లబిస్తుంది. అంతేకాదు శని దోషాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే ఈ అపరాజిత మొక్కను ఇంట్లో ఏ దిశలో నాటితే మంచిదో తెలుసుకుందాం.

అపరాజిత మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు
ఉద్యోగం కోసం
మీకు నచ్చిన ఉద్యోగం పొందాలంటే అపరాజిత పువ్వును తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి. ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు మీతో తీసుకెళ్లండి. తప్పకుండా విజయం సాధిస్తారు.
ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం కోసం
ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే..సోమవారం, శనివారంలో అపరాజిత 3 పువ్వులను నీటిలో వేయండి. ఇలా మూడు వారాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
శనిదోషం నుంచి విముక్తి
ఈ పుష్ఫాలను శనీశ్వరుడికి సమర్పిస్తే శనిదోషం నుంచి విముక్తి లభిస్తంది.
అపరాజిత మొక్కను ఏ వైపు నాటాలి
ఇంట్లో అపరాజిత మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటికి ఉత్తరం వైపున ఈ మొక్కను నాటండి. ఇలా నాటితే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. పొరపాటును కూడా ఈ మొక్కను దక్షిణ లేదా పడమర దిశలో నాటకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.