Astrology: ఈ చేయి దురద పెడుతోందా..?అయితే ఐశ్వర్యం తలుపుతట్టినట్లే..!!

  • Written By:
  • Publish Date - November 21, 2022 / 07:22 PM IST

మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఏదొకదానితో ముడిపడి ఉంటుంది. అయితే చిన్నప్పుడు మన ఇంట్లో తాతమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు అంటుండేవాడు. కుడి చేయి దురద పెడితే జరిగుతుంది. ఎడమ చేయి దురద పెడితే ఇది జరుగుతుంది. కన్ను కొట్టుకుంటే అరిష్టం. తుమ్మితే అశుభం. ఇలా ఎన్నో నియమాల గురించి చెప్పేవారు. వారు చెప్పేవి శాస్త్రీయంగానూ..సైన్స్ పరంగానూ నిజమే అనిపిస్తుంది. అయితే చాలాసార్లు మనకు చేయి దురద పెడుతుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చేయిదురద అనేది వ్యక్తి భవిష్యత్తులో జరిగబోయే అశుభసంఘటనల గురించి సూచిస్తుది. కానీ కొంతమంది దీనిని అస్సలు పట్టించుకోరు. శకున శాస్త్రంలో ఒక వ్యక్తి శరీర భాగాల్లో దురద గురించి ప్రస్తావించారు. అవేంటో చూద్దాం.

కుడి చేతి దురద :
శకున శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి కుడి చేతి దురద పెడితే అది అశుభానికి సంకేతం. మీరు భవిష్యత్తులో ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొవల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో కొంత ఆలోచించి పనిచేయాల్సి ఉంటుంది.

ఎడమ చేతి దురద :
ఒక వ్యక్తికి ఎడమ చేతి దురదగా అనిపిస్తే అది శుభప్రదానికి సంకేతం. మీరు త్వరలోనే ద్రవ్యలాభాలకు సంబంధించి శుభవార్త వింటారు. శకున శాస్త్రం ప్రకారం ఎడమ చేతిలో దురద ధనలాభాన్ని సూచిస్తుంది. ఈ ద్రవ్యలాభం ఏరకంగానైనా ఉండవచ్చు. ఎడమచేయి దురదగా ఉందంటే మీకు మంచి రోజులు ప్రారంబం కానున్నట్లు అర్థం.

శరీరం ఈ భాగాలలో దురద ఉంటే:
ఛాతీ మీద దురద ఉంటే మీరు త్వరలో పూర్వీకుల డబ్బును అందుకుంటారని అర్థం. కాళ్ళలో దురద ఉంటే వ్యక్తి ప్రయాణం చేయబోతున్నాడని అర్థం. కడుపులో దురదను చూసినట్లయితే, సంబంధంలో విభేదాలు వస్తాయని అర్ధం.