Dattatreya Stotras: ఈ దత్తాత్రేయ స్తోత్రాలు గురువారం పఠిస్తే..? సమస్యలు పరార్..

దత్తాత్రేయ స్తోత్రాలు (Dattatreya Stotras).. గురువారం పూట ఈ దత్తాత్రేయ (Dattatreya) మంత్రాలలో మీ సమస్యకు తగట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రత బట్టి 1008 సార్లు గాని రోజూ ఉదయం జపం చేయాలి. 1. సర్వరోగ నివారణ దత్త మంత్రం. “నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో|| సర్వ రోగ ప్రశమనం కురు శాంతిమ ప్రయచ్ఛమే||” 2. సర్వ బాధ నివారణ మంత్రం. “నమస్తే భగవన్ […]

Published By: HashtagU Telugu Desk
If These Dattatreya Hymns Are Recited On Thursday.. Problems Are Gone..

If These Dattatreya Hymns Are Recited On Thursday.. Problems Are Gone..

దత్తాత్రేయ స్తోత్రాలు (Dattatreya Stotras)..

గురువారం పూట ఈ దత్తాత్రేయ (Dattatreya) మంత్రాలలో మీ సమస్యకు తగట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రత బట్టి 1008 సార్లు గాని రోజూ ఉదయం జపం చేయాలి.

1. సర్వరోగ నివారణ దత్త మంత్రం.
“నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో||
సర్వ రోగ ప్రశమనం కురు శాంతిమ ప్రయచ్ఛమే||”

2. సర్వ బాధ నివారణ మంత్రం.
“నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||
సర్వ భాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే||”

3. పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించ బడిన ధనము లేక వస్తువుల తిరిగి పొందుటకు..
కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్||
తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే||

4. దరిద్ర నివారణ దత్త మంత్రం.
“దరిద్ర విప్రగ్రేహే య: శాకం భుక్త్వోత్తమ శ్రియమ||
దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు||”

5. సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం.
“దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం||
యో భూదభీష్టదః పాతు సనః సంతాన వృద్ధికృత్||”

6. సౌభాగ్యం కోసం దత్త మంత్రం.
“జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహా||
మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు||”

7. రుణబాధల విరుగుడు కోసం ఇంకా.. అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కోసం దత్త మంత్రం.
“అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋణాత్||
దత్తాత్రేయం తమీశానం నమామి ఋణముక్తయే||”

8. సర్వ పాప నివారణ దత్త మంత్రం.
అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః||
తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే||

9. దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం.
అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన||
దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ||

10. ఉన్నత విద్య కోసం దత్త మంత్రం.
విద్వత్సుత మవిద్యం య అగతం లోక నిందితం||
భిన్న జిహ్వం బుధం చక్రే శ్రీ దత్తః శరణం మమ||

11. సర్వ కష్ట నివారణ దత్త మంత్రం.
“అనసూయాత్రి సమభూతో దత్తాత్రేయో దిగంబర: స్మర్తృగామీ స్వభక్తానాం ఉధ్ధర్తా భవ సంకటాత్||

పఠించే విధానం..

గురువారం పూట ఈ దత్తాత్రేయ (Dattatreya) మంత్రాలలో మీ సమస్యకు తగట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రత బట్టి 1008 సార్లు గాని రోజూ ఉదయం జపం చేయాలి. ఇలా 41 రోజులు లేదా 41 వారాలు చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు.

Also Read:  Navratri Special: ఈసారి నవరాత్రులు ప్రత్యేకం.. 110 ఏళ్ల తర్వాత 4 గ్రహాల మహా సంయోగ సందర్భం

  Last Updated: 15 Mar 2023, 12:45 PM IST